Tag Archives: Forces

భారత్ని ముక్కలు చేసే ప్రయత్నంలో జాన్ దయాల్ పాత్ర

భారత్ని ముక్కలు చేసే ప్రయత్నంలో జాన్ దయాల్ పాత్ర

2014 ఏప్రిల్6 వ తేదీ నాటి ఒక ప్రముఖభారతీయ దిన పత్రిక భారతదేశములోనున్న మతస్వాతంత్రము గురించి యు యస్ కాంగ్రెస్ ప్యానెల్  జరిపిన హియరింగ్ గురించిన వార్తను ప్రచురించింది.  ఆ నివేదికయొక్కశీర్షిక “రో ఓవర్ టైమింగ్ ఆఫ్  యు యస్ ప్యానల్స్ మోడీ రిమార్క్స్(                          ) “  ఏప్రియల్ , 2014  నాడువాషింగ్టన్ డిసి లో జరిగిన టామ్ లాంటోస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TLHRC)యొక్క ప్లైట్ ఆఫ్ రెలిజియస్ మైనారిటీస్ ఇన్ ఇండియా“ అన్న విషయముపై జరిగినహియరింగ్ గురించి.

కమిషన్  మాటలలో చెప్పాలంటే, దీని ఉద్దేశ్యము “యు యస్ ఇండియా సంబంధాల పునరాలోచన.  ఇంకొకప్రజాస్వామ్యము యొక్కన్యాయబద్దమైన ఎన్నికల విషయములోకలుగజేసుకొనే  ప్రయత్నములో భారతదేశములో జరిగే ఎన్నికలు అల్పసంఖ్యాక మతస్ధులువివక్షకు గురి అయ్యే విధంగా జరుగుతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.  భారతదేశము ముఖ్యంగా బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలు క్రైస్తవ మిషనరీల లేక వారు బలపరిచే సంస్థలయొక్క లక్ష్యంగా వున్నాయన్నడానికి నిదర్శనంగా కమిషన్ కఠోర పక్షపాత ధోరణిలో భారతదేశము యొక్క ఆంతరింగక విషయములో జోక్యం కలుగజేసుకొనే విధంగా ఐదు రాష్ర్టాలలో అమలులోనున్న “ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్“ చట్టము వలననిజానికి మైనారిటీల యెడలవివక్ష చూపడము మరియుఅణగదొక్కడము ఎక్కువయునాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.  ఇంకొక విధంగా చెప్పాలంటే కొన్ని చిన్నచిన్నప్రాంతీయ సమస్యలను భూతద్దంలో చూపారు. ఈ చట్టము మిషనరీల పనులకు మరియు వారియొక్క ముఖ్యోద్దేశ్యమైన“హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్“ కొరకువిదేశాలనుండిలభించే విరాళాలకి అఢ్డంకిగా మారినదన్న విషయము తేటతేల్లమవుతుంది.

ఎక్కువవుతన్నప్రాశ్చాత్య దేశముల మధ్యవర్తిత్వ వ్యవహారము కమిషన్ యొక్కక్రింద తెలిపిన అభిప్రాయము వలన వ్యక్తీకృతమవుతుంది

“భారతదేశము యొక్క 2014 జాతీయ ఎన్నికలు జరుగబోవుచున్న ముందు నెలలలో మైనారిటీ మతస్ధులపై జరిగే హింసాత్మక చర్యలు, వివక్షాపూరితప్రసంగాలు ఎక్కువయి జాతీయ రాజనీతిని మతపరంగా కులపరంగా విడగొట్టాయి. “  ఒక బలమైన ధృఢమైన నాయకత్వము లో  ఆవిర్భవిస్తున్న నవశకము ఈ జోక్యదారిలకు మింగుడుపడటములేదు.  భారతదేశము యొక్క విదేశప్రణాళికలగురించి సలహాలివ్వడానికీ, జోక్యంచేసుకోవడానికీ అవకాశం వుండదన్న ఆలోచన వారిని ఎంతో అసౌకర్యానికి గురిచేస్తోంది.  ‘మైనారిటీ మతస్ధులు మోడీ ప్రభుత్వము అధికారములోనికి వస్తే మతస్వాతంత్రము కోల్పోతామన్న భయంతో వున్నారని‘ USCIRF  ప్రతినిధి మరియు ప్యానల్ యొక్క ముఖ్యసాక్షి, కట్రీనా స్వెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మోడి ప్రభుత్వము అధికారములోనికి రావడము వల్ల తనకు గల భయాందోళనలను వెల్లడించారని ఆ  రిపోర్టులో తెలిపారు.

మనకు ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి పాఠాలు నేర్చుకొనవలసిన ఆవసరము గానీ, మన ప్రవర్తనగురించి ఎటువంటి ప్రమాణపత్రాలు పొందవలసేన అవసరము లేనప్పటికీ, భారతదేశము యొక్క ఆంతరింగక వ్యవహారాలలో జోక్యం చేసుకొంటూ భారతదేశముయొక్క సుప్రజాస్వామ్య వ్యవస్ధను అప్రతిష్టకు గురిచేసే ఈ కమిషన్ యొక్క ప్రవర్తనగురించి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా వున్నది.

ఇంకొక ఆందోళనకరమైన విషయమేమనగా ‘మైనారిటీ మతాలకు చెందిన వ్యక్తుల పరిస్ధితులపై మరియు యు యస్ భారత విదేశ వ్వవహారాల విషయాలలో సలహాలివ్వడానికి భారతప్రభుత్వమునకు చెందిన నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ సభ్యుడైన శ్రీ జాన్ దయాల్ ను ఒక సాక్షిగా కమిషన్ నియమించింది.

కమ్యూనల్ వయొలెన్స్ బిల్లును రూపొందిచుటలో సహకరించినశ్రీ జాన్ దయాళ్ కు సోనియా గాంధీ ఆధ్వర్యములో నుండిన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తో సన్నిహిత సంబధాలు గలవన్నవిషయము లోక విదితము.

భారతదేశముపైహిందువులపై హిందూసంస్థలపై విదేశాలలో విషప్రచారము  జరుపుటలో దిట్ట.   ఇంతకు పూర్వము ఆయన చేసినకొన్ని చేష్టలు ఆ ప్రభుత్వము భారతదేశముయొక్క చిత్రాన్నివిదేశాలలో చూపిన ప్రదర్శనకుమచ్చు తునకలు. జాన్ దయాళ్ వంటి వారిని మరలా మరలా ప్రోత్సహించడములో ఇంకొక ఉద్దేశ్యము కనిపిస్తుంది. భారతదేశమును పగులగొట్టడమనే ప్రణాళికలో ఆయన పోషించినపాత్రను అవలోకిద్దాము.  విదేశాలలోభారతదేశమును, హిందువులనూ కించపరిచే విధంగా మాట్లాడేమరొక వ్యక్తి, శ్రీ కంచె ఎల్లయ్య యొక్క సాక్ష్యాన్ని ఆధారంగా చేసేకొని 2005లో US Commission on Global Human Rights ద్వారా చేసిన విమర్శలను దయాళన్న స్వాగతించి అది ఒక చారిత్రాత్మక సంఘటనగా వర్ణించారు. 

Policy Institute for Religion and State (PIFRAS),   “United Methodist Board of Church and Society and the National Council of Churches of Christ in the USA  ద్వారా స్పాన్సర్ చేయబడినదక్షిణఆసియా కాన్ఫపరెన్సు లో జాన్ దయాల్ “ అల్పసంఖ్యాక వర్గము తమను రక్షించుటకుగానీ తమపై జరిగే నేరాలకు తగిన న్యాయం చేకూర్చడానికి గానీ భారత ప్రభుత్వము పై ఆధారపడలేదని వుటంకించారని రాజీవ్ మల్హోత్రా మరియుఅరవిందన్ నీలకందన్ లు బ్రేకింగ్ ఇండియా ను స్టడీ చేసి తయారుచేసిన డాక్యుమెంటేషన్ లో వునన్నది.  విదేశాలలో భారత దేశపద్ధతులనుగురించి రాజకీయ వ్యవస్థ గురించి గానీదయాల్ మరల మరల చేసిన వ్యాఖ్యానాలను ప్రధాన మీడియా సంస్థలు గానీ ఆయనను సమర్ధించేఅప్పడు అధికారములో నున్న సోనియా గాంధీగారి కాంగ్రెస్ యుపిఏ గవర్నమెంటు గానీ ఎక్కువగా పట్టించుకోకుండానిర్లక్ష్యం చేసింది.

మన జాతీయత మరియు జాతీయ భద్రతను మరియు సార్వభౌమత్వాన్నిదృష్టిలో వుంచుకొని ప్రభుత్వము, కాంగ్రెసు మరియు దానికి వంతపడే వాళ్లుసమాధానము చెప్పవలసిన అవసరము ఎంతైనా వున్నది.

 1. దయాల్ TLHRC ముందు తన స్వతంత్ర ప్రతిపత్తిపై హాజరయినారా అయినచో ఆయనను భారతప్రభుత్వముద్వారా నియమించ బడిన ఒక సంస్థలో సభ్యునిగా ఆయనను వుటంకించవలసిన ఆవసరము ఏమిటి?  కానియెడల దేశములో ఎన్నికలు జరుగనున్న సమయములో ఈ పర్యటన జరిగిన విషయాన్ని భారతప్రభుత్వము పరిగణలోనికి తీసుకున్నదా?  ఈ విషయము ఎన్నికల కమిషన్ వారు మరియు చట్టములు అమలుచేసే ఇతర ఏజెన్సిలు గుర్తించగలవికాదా?

2. బిజెపి ప్రభుత్వము అధికారములోకి వస్తే అల్పసంఖ్యాక వర్గాలకు మత స్వేచ్చవుండదనేవిషయము గురించిTLHRC ఎదుట సాక్ష్యాలిచ్చిన  కొందరి  అభిప్రాయాలను  దయాల్ అంగీకరిస్తారా: అదే నిజమయితే సోనియా ద్వారా నియంత్రింపబడిన యుపిఏ గవర్నమెంటు తన స్వంత సంస్థయొక్క సభ్యుడిని మన ఆంతరంగిక విషయాలను విదేశాలలో చర్చించడానికీ మరియు భారత రాజకీయాల గరించి నిరాధారమైనప్రతికూలవ్యాఖ్యలు చేయడానికి అనుమతించవచ్చా?

3. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ సభ్యునిగా జాన్ దయాల్ యొక్క ఈ పర్యటన గురించి ద్ర.మన్మోహన్ సింగ్ కి,  సోనియాగాందీకి తెలుసునా మరియు దీనికి వాళ్ళ అనుమతి మరియు సమర్ధత వున్నదా?

4. కాంగ్రెస్ ఆధ్వర్యములోని యుపిఏ భారతదేశము యొక్క ఆంతరంగిక విషయాలలో బాహ్యజోక్యాలను ప్రోత్సహించడమే కాకుండా దానిని చూసీసూడనట్లుగా వుండేదన్న నిజాన్ని నిరూపరించడానికి జాన్ దయాల్ TLHRC ఎదుట ఇచ్చిన పూర్తిసాక్ష్యాన్ని బయటపెట్టవలసిన ఆవసరము ఎంతో వున్నది.

హిందువులను కించపరచే ఏకైక లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ మేధో మఫియాలను, కిరాయి సభ్యులను నియోగించడమన్నది నిజము. ఈ విధమైన ప్రచారం మాఫియాదేశములో జరిపిందా లేక విదేశాలలో ఈ విషమును వెళ్ళగక్కుతున్నదా అన్న విషయము కాంగ్రెస్ కు అనవసరము. ఏ విషయమైనాహిందువులను కించపరిచగలిగి  రాక్షసులుగా చూపగలిగితే  దానివలన భారతదేశముయొక్క ప్రతిష్టదిగజారవచ్చునన్న విషయము వారికి  అనవసరము.

జాన్ దయాల్ వంటి వారు కాంగెస్ మరియు హైడ్రాతలలవంటిదాని వ్యవస్థలచే పెంచి పోషించి రక్షించబడుతున్నారు.  దీనిని వెలికి తీసే ప్రకటించి రద్దు చేయవలసిన అవసరము ఎంతైనా వున్నది.

  (రచయిత న్యూ  ఢిల్లీలోని డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రిసర్చ్ ఫౌండేషన్ యొక్క డైరెక్టరు.  ట్విటర్ హాండిల్ @anirbanganguly)

అనువాదం – సరోజినీ నడింపల్లి