Source : K.M.Munshi’s ” The End of an Era”
నిజాం రజాకార్ల తో చేతులు కలిపిన కమ్యూనిస్టులు
మే 1948, భారత ఏజెంట్ జనరల్ కే ఎం మున్షి గారు రచించిన “ ఎండ్ అఫ్ ఏరా” అనే పుస్తకం లోనిది
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ హైదరాబాద్ గతంలో తీసుకున్న నిర్ణయం నుంచి పూర్తిగా విరుద్ధమైన ప్రకటనతో ఒక కొత్త పాంఫ్లెట్ ముంద్రించడం జరిగింది. అందులో, హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో వీలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ ప్రభుత్వం ఒక పెట్టుబడిదారి ప్రభుత్వం అని ఆరోపించింది.
కమ్యూనిస్టులు తాము నిలకడగా ఉన్నాము అని చెప్పుకోవడానికి, నిజమైన స్వాతంత్రం రావాలి అంటే భూస్వామ్య వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలించబడాలి అని నినాదం ముందుకు తెచ్చారు.
కొన్ని నివేదికల ప్రకారం, నిజాం ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ లకు మద్య ఒక అవగాహన మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్ లోని కమ్యూనిస్ట్ లు ద్వార ఇక్కడి రజాకార్లకు మారణాయుధాలు అందించబడుతున్నాయి.
కమ్యూనిస్ట్ ల నూతన ప్రచారం ప్రకారం దేశంలోని వివిధ సంస్థానాలు, భారత్ యూనియన్ వీలేనం కావడం అనే ప్రక్రియనే పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది అని, ప్రజల మనస్సులో ఉన్న తిరుగుబాటును అనగదోక్కడమే అన్నారు.
భారతీయ సైన్యాలు ఒకవేళ హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశిస్తే, అవి ప్రజల ఉద్యమాన్ని అనిచివేయడానికె అని ప్రకటించారు. కమ్యూనిస్ట్ ల ప్రాభల్యం లేదా భయం ద్వార తమ గుప్పిట్లో ఉన్న గ్రామాలలో ఒకవేళ భారత సైన్యాల కదలికలను కనిపిస్తే వాటిని వ్యతిరేకించాలి అని తమ కార్యకర్తలు, సానుభూతి పరులను ప్రోత్సహించారు ; #HydLiberationDay #HyderabadLiberationDay