కేరళ కమ్యూనిస్టుల ప్రభుత్వపు హింసారాజకీయాలను వ్యతిరేకిద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం

#EndViolenceCPM

1969లో దర్జీ పని చేసుకుంటున్న రామకృష్ణ హత్యలో ప్రధాన నిందితుడు నేటి ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌. తమ విఘటనవాద, విచ్ఛిన్నకర, ద్వేషపూరిత విధానాలకు విరుగుడుగా విశుద్ధ, జాతీయవాద, స్నేహపూర్వక, సమరసతామయ భావంతో ముందుకు వచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) నేతలకు మింగుడు పడడంలేదు.

మా ‘మార్గమే నిజమైనద’నే సెమెటిక్‌ సంకుచితత్వం, ప్రత్యర్థుల్ని మట్టుపెట్టి మార్గం సుగమం చేసుకోవాలనుకునే నాజీ, ఫాసిస్ట్‌ ధోరణి నరనరాన జీర్ణించుకున్న మార్క్సిస్టులు హింసావాదాన్నే నమ్ముకున్నారు. తమ హింసోన్మాదానికి ‘విప్లవం’, ‘పోరాటం’ అని ముద్దుపేర్లు పెట్టుకున్నారు.

కేరళ లో జరుగుతున్న ఈ దాడులకు నిరసనగా జాగృత భారత్, MMRI వారు 3-మార్చ్-2017, ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, భాగ్యనగర్ లో “మహాధర్నా” ను నిర్వహిస్తున్నారు.

Video

 

 

Leave a comment