భారత దేశంలో కుల సమస్యపై స్వామి వివేకానంద

`ప్రపంచానికి నేనొక సందేశం ఇవ్వాలి, అది నేను భయం, భవిష్యత్తు గురించి జాగరూకత లేకుండా చెప్పదలుచుకున్నాను. సంఘ సంస్కారులతో, నేను వారికన్నా పెద్ద సంస్కరణవాదినని చెప్పగలను. వారికి చిన్న చిన్న సంస్కరణలు కావాలి, నాకు వేర్లు కొమ్మలతో సహా సంస్కరణ కావాలి’.

 భారత దేశంలో కుల సమస్య

 కులం సంఘంలో ఉంది, మతంలో కాదు

 మన కులాలు, సంస్థలకి, మతంతో సంబంధం ఉన్నట్లు కనిపించినా, అది నిజం కాదు. ఒక దేశంగా మనని పరిరక్షించడానికి ఈ వ్యవస్థ అవసరమైంది, స్వయం-పరిరక్షణ అనే అవసరం తీరిపోయినపుడు, అవి వాటంతటకి అవే నశిoచిపోతాయి. మతంలో కులం లేదు. ఒక అగ్రకుల వ్యక్తి, ఒక నిమ్నకుల వ్యక్తి సన్యాసి /స్వామి కావచ్చు, అపుడు ఆ రెండు కులాలు సమానమే. వేదాంత మతానికి కుల వ్యవస్థ వ్యతిరేకం.

కులం ఒక సాంఘిక ఆచారం, మన గురువులు అందరు దానిని  కూలదోయడానికి ప్రయత్నిoచారు. బౌద్ధమతం నుంచి, ప్రతి శాఖ, సాంప్రదాయం కులవ్యవస్థకి వ్యతిరేకంగా బోధించాయి, కాని ప్రతిసారి సంకెళ్ళు మరింత బిగుసుకున్నాయి. గౌతమ బుద్ధుడినుంచి రామ్మోహన్ రాయ్ వరకు అందరూ పొరపాటుగా కులాన్ని మత వ్యవస్థలో భాగంగా చూసి, మతo కులo రెంటిని సమూలంగా దిగజార్చడానికి ప్రయాసపడ్డారు, ఓడిపోయారు.

మతాధికారులు ఎంత ఆవేశంగా దురుసుగా మాట్లాడినా, కులo- పటిష్టంగా ఏర్పడిన సాంఘిక వ్యవస్థ మాత్రమే. కులం  ప్రయోజనం పూర్తి అయింది కాబట్టి, అది కేవలం ఇపుడు, దుర్గంధంతో భారతదేశ వాతావరణంలో కాలుష్యం కలగజేస్తోంది. ప్రజలకు వారు కోల్పోయిన సామాజిక అస్తిత్వం తిరిగి ఇవ్వగలిగితే, కులాన్ని పూర్తిగా పారదోలవచ్చు. దేశ రాజకీయ వ్యవస్థల అపరిమిత పెరుగుదలే కులం, అది ఒక వారసత్వ వాణిజ్య సంఘం. బోధనల కన్నా ఎక్కువగా యూరోప్ తో వాణిజ్య పోటి కులాన్ని ఛేదిస్తోoది.

 కులవ్యవస్థకు  అధారితమైన యోచన

 నా వయసు పెరుగుతున్నకొద్దీ, భారతదేశంలో కులం మరియు ఇతర అనాది కాలంగా ఉన్న వ్యవస్థల గురించి, నా అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు ఇవన్నీ పనికిరానివి, అర్ధంలేనివి అనిపించేది, కానీ నేను పెద్దవుతున్నపుడు, వాటిని దూషించడంలో తేడా కనిపిస్తోంది, ఎందుకంటే ఈ వ్యవస్థలు శతాబ్దాల అనుభవానికి ప్రతిరూపాలు.

నిన్న పుట్టిన పిల్లవాడు, రేపోమాపో చనిపోబోతున్నవాడు, నా దగ్గరకు వచ్చి నా ప్రణాళికలన్నీ మార్చుకోమంటే, ఆ బాలుడి మాట విని, అతని ఊహల ప్రకారం నేను నా పరిసరాలన్నీ మార్చేస్తే, నేను మూర్ఖుడినవుతాను. ఇతర దేశాలనుంచి మనకి వస్తున్న సలహాలు ఇలాంటివే. ఆ పండితులకి ఇలా చెప్పండి “మీరు మీకోసం ఒక స్థిరమైన సమాజం ఏర్పరుచుకుంటే, అపుడు మీ మాట వింటాను. ఒక ఆలోచనను రెండు రోజులు కొనసాగించలేక, మీలో మీరే పోట్లాడుకుని ఓడిపోతున్నారు. వసంతంలో పుట్టిన శలభాల్లాగా, అయిదు నిముషాల్లో నశిస్తున్నారు. నీటి బుడగల్లాగా పుట్టి, బుడగల్లాగే చెదిరిపోతున్నారు.  ముందుగా మాలాగా స్థిరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోండి, శతాబ్దాలుగా ఉన్నా, చెక్కుచెదరని, వాటి శక్తి కోల్పోని చట్టాలు వ్యవస్థలు తయారు చేసుకోండి. అప్పుదు మీతో మాట్లాడే సమయం వస్తుంది, అప్పటిదాకా, నా స్నేహితులారా, మీరు చిన్న పిల్లలు మాత్రమే”.

కులం మంచిది, ఈ ప్రణాళిక మేము అనుసరించదలుచుకున్నాము. కోటిమందిలో ఒక్కడు కూడా, కులం ఏమిటన్నది అర్ధం చేసుకోలేదు. ప్రపంచంలో కులం లేని దేశం ఏదీలేదు. ఆ సూత్రం మీదే కులం అధారపడి ఉంది. భారతదేశంలో ప్రణాళిక అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేయాలనే, మానవాళికి ఆదర్శం బ్రాహ్మణ్యం. భారతదేశ చరిత్ర చదివితే, క్రింది తరగతులవారిని పైకి తేవాలనే ప్రయత్నం ఎల్లపుడూ కనిపిస్తూనే ఉంటుంది. చాలా తరగతులవారు ఆ విధంగా పైకి రాగలిగారు. అన్ని తరగతులు, మొత్తం సమాజం బ్రాహ్మణo అయేదాకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే ప్రణాళిక.

ఆధ్యాత్మిక సంస్కృతికి, త్యాగానికి ఆదర్శం బ్రాహ్మణ్యం. ఆదర్శ బ్రాహ్మణo అంటే నా ఉద్దేశం ఏమిటి? బ్రాహ్మణ తత్వం  అంటే ప్రాపంచిక దృష్టి లేకుండా, సత్యమైన వివేకం అపారంగా కలిగి ఉండడం. అదే హిందూ జాతికి ఆదర్శం. చట్టo పరిధిలో రాకుండా, అసలు శాసనమే లేకుండా, రాజుల పాలన క్రిందకి రాకుండా, శరీరానికి హాని కలగకూడని వ్యక్తి బ్రాహ్మణుడనే మాట మీరు వినలేదా? అది సత్యం. కావాలని ఉద్దేశపుర్వకంగా మాట్లాడే అజ్ఞ్యానుల అర్ధంతోకాక, నిజమైన మూల వేదాంత భావనతో అర్ధం చేసుకోండి.

స్వార్థం పూర్తిగా తొలగించి, జ్ఞ్యానం వివేకం ప్రేమ ఆర్జించి అందరికి పంచే జీవనం కల  వ్యక్తులే బ్రాహ్మణులైతే, మొత్తం దేశం ఇటువంటి  బ్రాహ్మణులతో నిండిఉంటే, వారు అధ్యాత్మికత నైతికత మంచితనం కలిగిన స్త్రీ పురుషులైతే, అటువంటి దేశం మామూలు చట్టాలు, శాసనాల పరిధి దాటిఉంటుంది అనడంలో వింత ఏముంది?  వారిని శాసించడానికి పోలీసులు, సైన్యం అవసరం ఏముంది? అసలు వారిని ఎవరైనా ఎందుకు పాలించాలి? ఒక ప్రభుత్వం కింద వారు ఎందుకు ఉండాలి? వారు మంచివారు, ఉత్తములు, భగవంతునికి చెందినవారు; వీరు మన ఆదర్శ బ్రాహ్మణులు. సత్యయుగంలో ఒక్క బ్రాహ్మణ కులం మాత్రమే ఉండేదని చదువుతాము. ఆదికాలంలో ప్రపంచమంతా బ్రాహ్మణులే ఉండేవారని, వారు పతనమౌతున్నకొద్దీ, అనేక కులాలుగా విడిపోయారని మనం మహాభారతంలో చదువుతాము. అలాగే ఆ వృత్తo పూర్తయితే, మళ్ళీ మానవజాతి బ్రాహ్మణ మూలాలకే చేరుకుంటుంది,

బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడే అవడు, అతను బ్రాహ్మణుడు అవడం ఎన్నో విధాలుగా సాధ్యమే అయినా, అతను అవకపోవచ్చు. బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ తత్త్వం రెండు వేరు విషయాలు.

ప్రతి మానవుడిలో, సత్త్వ రజస్ తామస గుణాలు- ఎదో ఒకటి గాని, అన్నీ గాని – హెచ్చు తగ్గుల్లో ఉంటాయి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా తయారయే లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఏ సమయంలోనైనా, ఎదో ఒక లక్షణం ప్రదానoగా కనపడి ప్రస్ఫుటమౌతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి అదాయంకోసం ఇంకొకరికి సేవ చేస్తే, అది శూద్రత; అదే వ్యక్తి వ్యాపారలాభం కోసం ఎదోఒక  పనిచేస్తే, అపుడతను వైశ్యుడు; అన్యాయాన్ని ఎదిరిస్తే అపుడతను క్షత్రియుడు; భగవంతుడి ధ్యానంలో, సంభాషణలో ఉంటే అపుడతను బ్రాహ్మణుడు. కాబట్టి, ఒక కులం నుంచి ఇంకొక కులానికి మారడం సాధ్యమే. లేకపోతే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడెట్లా అయాడు, పరశురాముడు క్షత్రియుడు ఎలా అయాడు?

యూరోపియన్ నాగరికతకు ఆధారం కత్తి అయితే, భారత నాగరికతకు ఆధారం వర్ణ విభజన. విజ్ఞ్యానం సంస్కృతి, తద్వారా నాగరికత పెంపొందించుకుంటూ పైపైకి మానవుడు ఎదగడమే వర్ణ-ఆధారిత వ్యవస్థ. బలవంతుడి గెలుపు, బలహీనుడి ఓటమి యూరోప్ లక్షణం. భారత భూమిలో ప్రతి సామాజిక నియమం, బలహీనుల రక్షణకై ఏర్పాటు చేయబడింది.

మానవుడిని- ప్రశాంత, నిశ్చల, స్వచ్చ, ధ్యానపూరిత అనగా- ఆధ్యాత్మిక మానవునిగా తీర్చిదిద్దడానికి, సమస్త మానవాళిని ఆ దిశగా సౌమ్యతతో నడిపించడమనే ఆదర్శం కులం. భగవంతుడు ఆ ఆదర్శంలో భాగమై ఉన్నాడు.

భారతీయ కులం, భగవంతుడు అందజేసిన గొప్ప సామాజిక వ్యవస్థ అని మేము నమ్ముతాము. అనివార్య లోపాలు, విదేశీయుల ఆక్రమణ- యుద్ధాలు, చాలామంది బ్రాహ్మణుల(ఆ పేరుకి అర్హత లేని వారు) అజ్ఞానం అహంకారం మొదలైన లోపాలు, ఈ ఉన్నతమైన భారతీయ కుల వ్యవస్థను పక్కదారి పట్టించి, మనకు అందాల్సిన ఫలితాలు అందనివ్వకుండా చేసాయి. ఈ భారత భూమిలో ఈ కుల వ్యవస్థ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఇది భారతజాతిని తన గమ్యానికి చేర్చేది.

కులం నిష్క్రమించగూడదు, కాని మార్పులు చేర్పులు జరగాలి. ఆ పాత కట్టడంలోనే రెండు లక్షల రకాల కొత్త వాటి నిర్మాణానికి కావాల్సిన జీవం ఉంది. కుల నిర్మూలన కోరడంలో అర్ధంలేదు.

 పరపతి అధికారాల అసమానత వ్యవస్థను కలుషితం చేస్తుంది  

వివిధ వర్గాలుగా సముదాయాలుగా ఏర్పడడం సమాజ ప్రకృతి.  కులం సహజ క్రమం. సామాజిక జీవనంలో నేనొక పని చేస్తాను, నువ్వు ఇంకొకటి చేస్తావు.  నేను చెప్పులు కుట్టగలను, నువ్వు దేశాన్ని ఏలగలవు; అంత మాత్రాన, నువ్వు నాకన్నా గొప్పవాడివని కాదు, ఎందుకంటే నువ్వు నాలాగా చెప్పులు కుట్టగలవా? నేను దేశాన్ని ఏలగలనా? కాని ఆ కారణంగా నువ్వు నా మీద పెత్తనం చేయలేవు. ఒకడు హత్య చేస్తే అతనిని పొగిడి, ఇంకొకడు ఒక పండు దొంగతనం చేస్తే, అతనిని ఉరితీయడం ఎందుకు? ఇది సరికాదు, ఇది తోసివేయాలి.

కులం మంచిది, అది సహజ జీవన పరిష్కారం. ఎక్కడైనా జనం సముదాయాలుగా ఏర్పడతారు, ఇది తప్పించలేము. ఎక్కడికెళ్ళినా కులం ఉంటుంది, కాని దాని అర్ధం ఈ పరపతి అధికారాలు ఉండాలని కాదు. ఇవి పడగొట్టాలి. ఒక మత్స్యకారుడికి వేదాంతం బోధిస్తే, అతను `నువ్వెలాంటి మనిషివో నేను అంతే, నేను మత్స్యకారుడిని, నువ్వు తత్వవేత్తవు, నీలో ఉన్న దేవుడే నాలొనూ ఉన్నాడు’ అని అంటాడు. అదే మనకు కావాలి, ఎవరికీ ఏ అధికారాలు పరపతులు ఉండకూడదు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి; ప్రతి మానవుడిలో పరమాత్మ ఉన్నాడని, వారు తమ మోక్ష మార్గాలు తెలుసుకుంటారని, అందరికి బోధించాలి. ప్రత్యేక అధికారాలు, పరపతులు ఉన్న రోజులు శాశ్వతంగా భారత భూమిలోoచి పోయాయి.

అస్పృశ్యత- మూఢనమ్మకాల కూడిక

ఒకప్పుడు ఉన్నత మనస్కుల లక్షణం ఇది – “త్రిభువనముపకార శ్రేనిభిత్ ప్రియమనః”- `అనేక సేవలతో సంపూర్ణ విశ్వాన్ని ఆనంద పరుస్తాను’, కాని ఇపుడు- `నేను ఒక్కడినే స్వచ్చమైన పవిత్రుడిని, సమస్త ప్రపంచం అపవిత్రం’, `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’! భగవాన్! ఈ కాలంలో, పరబ్రహ్మ -హృదయంలో, ఆత్మలో లేడు, అనంతలోకాల్లో లేడు, సమస్త జీవరాసుల్లో లేడు- ఇపుడు  దేవుడు వంట గిన్నెల్లో ఉన్నాడు!

మనం `ఛాందస’  హిందువులం, కాని `అంటరానితనం’ మనo ఒప్పుకోము. `అంటరానితనం’ హిందూ మతం కాదు, మన గ్రంథాల్లో ఇది లేదు. ఇది ఒక ఛాoదస మూఢనమ్మకo, మన దేశ సామర్థ్యాన్ని చాలాకాలంగా ఇది దెబ్బ తీస్తోంది. మతం వంటగిన్నెల్లోకి ప్రవేశించింది. హిందువుల ప్రస్తుత మతం జ్ఞ్యానమార్గం కాదు, హేతుమార్గం కాదు, కేవలo   `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ మాత్రమే.

ఈ `అంటరానితనం’ ఒక మానసిక రుగ్మత. జాగ్రత్త! విస్తృతి జీవం, సంకోచం సంకుచితం మరణం. ప్రేమ విస్తృతి, స్వార్థం సంకోచం. కాబట్టి ప్రేమ మాత్రమే జీవన సూత్రం. హిందూ మతమే కాని ఈ అనాచార `అంటరానితనానికి’ మీ జీవితాలను కోల్పోవద్దు. `ఆత్మాయాత్ సర్వభూతేషు’- `సమస్త ప్రాణులు  నీవు అనే భావించు’ అనే బోధన గ్రంథాలకే పరిమితం కావాలా? ఆకలితో ఉన్నవారికి ఒక రొట్టె పెట్టలేని వాడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది? ఇంకొకరి గాలి సోకితేనే మైలపడేవారు, ఇతరులను ఎలా శుద్ధి చేయగలరు?

ఇతరులను క్రూరంగా చూడడం మానేయాలి. ఎంత అసంబద్ధమైన స్థితికి వచ్చాము! ఒక భంగీ (అప్పటి అంటరాని కులం) ఎవరి దగ్గరికైనా వస్తే, అతన్ని దూరంగా పెడతారు. ఒక చర్చ్ పాస్టర్ అతని నెత్తిన నీళ్ళు పోసి, ఎదో ప్రార్థన చేసిన తర్వాత, అతనే ఒక చింపిరి కోటు తొడుక్కుని గదిలోకి వస్తే, అదే `ఛాoదస’ హిందువు, కుర్చీ వేసి కరచాలనం చేస్తాడు! ఇంతకన్నా విచిత్రమైన అసంబద్ధత ఏమైనా ఉంటుందా.

సానుభూతి దొరకక, వేలాదిమంది `అంటరానివారు’ మద్రాసులో మతం మార్చుకుని క్ర్రిస్తియన్లు అవుతున్నారు. కేవలం ఆకలి తీర్చడం కోసమే అనుకోకండి, వారికి మననుంచి ఎటువంటి సానుభూతి దొరకక. మనం రాత్రి పగలు `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ అని మాత్రమే అంటున్నాము. దయ జాలి ఉన్న హృదయాలు ఈ దేశంలో ఉన్నాయా?  ఈ `ముట్టుకోవద్దు’ మూడాచారాలను తరిమి కొట్టండి!  ఈ `అంటరానితనం’ అడ్డంకులను బద్దలుకొట్టి, `అందరు రండి, పేద దీన బడుగు ప్రజలారా’ అని గొంతెత్తి పిలిచి అందరినీ ఒక దగ్గరికి చేర్చాలని నాకు బలంగా అనిపిస్తుంటుంది. వారoదరూ లేచి ముందడుగు వేస్తే తప్ప, `అమ్మ’  మేలుకోదు.

ప్రతి హిందువు, మరొకరికి సోదరుడే అని నేనంటాను.  `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ అనాచారంతో మనమే వారిని ఈ అధ్వాన్న స్థితికి దిగజార్చాము. దానితో మొత్తం దేశo అజ్ఞ్యానo, పిరికితనంలో దిగజారిపోయి అధోగతి పాలయింది.  వీరందరినీ పైకి తీసుకురావాలి; ఆశ, విశ్వాసం కలిగించాలి. `మీరూ మాలాంటి మనుషులే, మాకున్న హక్కులు అధికారాలన్నీ మీకూ ఉన్నాయి’ అని మనం వారికి చెప్పాలి.

కుల సమస్యకు పరిష్కారం

పైనున్న శ్రేణులను క్రిందికి దించడం, పిచ్చి ఆవేశంలో ఏదిపడితే అది తిని తాగడం, హద్దులు దాటి ప్రవర్తించడం కులo ప్రశ్నకు సమాధానం కాదు, మన వేదాంత ధర్మం నిర్దేశించినట్లు నడుచుకోవడం, ఆధ్యాత్మికత సాధించి తద్వారా  ఆదర్శ బ్రాహ్మణుడిగా ఎదగడమే దీనికి పరిష్కారం. మీరు ఆర్యులైన, ఇతరులైనా, ఋషులు, బ్రాహ్మణులు లేక అత్యంత నిమ్న కులానికి చెందివారైనా, మీ పూర్వీకులచే మీ అందరిమీద విధించబడ్డ నియమం ఒకటుంది. అగ్రగామి వ్యక్తినుంచి అంటరాని వాడివరకు, మీ అందరికీ ఒకే ఆజ్ఞ్య,  ఆగకుండా ముందుకు పురోగమిస్తూనే ఉండాలి, దేశంలో ప్రతి ఒక్కరూ  ఆదర్శ బ్రాహ్మణుడిగా ఎదగడానికి కృషి చేయాలి. ఈ వేదాంత భావం ఇక్కడే కాదు, ప్రపంచమంతా వర్తిస్తుంది.

మానవాళికి ఆదర్శం  బ్రాహ్మణత్వమే అని శ్రీ శంకరాచార్యుల వారు తమ గీతా వ్యాఖ్యానానికి వ్రాసిన అద్భుతమైన ముందుమాటలో అన్నారు, ఈ బ్రాహ్మణత్వాన్ని సంరక్షిoచడానికే శ్రీ కృష్ణుడు గురువుగా అవతరించాడని అన్నారు. బ్రహ్మం అనబడే భగవంతుడికి చెందిన మనిషి బ్రాహ్మణుడు, ఆదర్శవంతుడు, పరిపూర్ణుడు, అతను వీడిపోకూడదు. ప్రస్తుతం కులంలో ఎన్ని లోపాలున్నా, బ్రాహ్మణత్వ లక్షణాలున్నవ్యక్తులు, మిగతా కులాలకన్నా ఎక్కువగా బ్రాహ్మణులనుంచే వచ్చారని మనం ఒప్పుకోక తప్పదు. వారి లోపాలు ఎత్తి చూపడానికి ధైర్యం చూపాలి, అలాగే వారికి చెందవలసిన గౌరవం కూడా ఇవ్వాలి.

కాబట్టి, కులాలమధ్య సంఘర్షణ వల్ల ప్రయోజనం లేదు. అది మనల్ని మరింత వేరు చేస్తుంది, ఇంకా బలహీనపరుస్తుంది, ఇంకా దిగజారుస్తుంది. పైనున్నవారిని క్రిందకు దించడం కాదు, క్రిందున్నవారిని పై స్థాయికి పెంచడంలోనే పరిష్కారం ఉంది. మన గ్రంథాల్లో అదే వ్రాయబడి ఉంది, ప్రాచీనుల ఉన్నత ప్రణాళిక, మేధాశక్తి కొంచెం కూడా అర్ధంకానివారు, తమ గ్రంథాలలోని  విషయాలు తెలియని పెద్దలు ఏమైనా చెప్పనీయండి. ఏమిటా ప్రణాళిక? ఒక చివరలో బ్రాహ్మణులు ఉంటే, మరొక చివరలో ఛoడాలురున్నారు, మన పని అంతా ఛoడాలులను బ్రాహ్మణుల స్థాయికి పెంచడమే, రానున్న కాలంలో నిమ్న కులాలకి మరిన్ని అధికారాలు, సౌకర్యాలు ఇవ్వడం మనం చూస్తాము.

ఈ ఆధునిక కాలంలో కూడా కులాల మధ్య ఇంత చర్చ జరగడం బాధాకరం, ఇది ఆగిపోవాలి. దీనివల్ల ఇరువైపులవారికి ఉపయోగం లేదు, ముఖ్యంగా బ్రాహ్మణులకి, ఎందుకంటే వారికి అధికారాలు పరపతులున్న రోజులు పోయాయి. ఉన్నత జమీందారీ వర్గాలు తమ గొయ్యి తామే తవ్వుకుoటారు, అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎంత ఆలస్యం అయితే, అంతగా కుళ్లిపోయి, ఆ చావు మరింత భయంకరంగా ఉంటుంది. కాబట్టి భారత దేశంలో బ్రాహ్మణులు మిగతా మానవజాతిని ముక్తి మార్గంవైపు నడిపించాలి, ఆ పని జరిపించినపుడే, జరిపించినంత కాలమే, వారు బ్రాహ్మణులు.

బ్రాహ్మణుడని చెప్పుకునే వాడు, తన ఆధ్యాత్మికతను సాధించడమే కాక, ఇతరులను అదే స్థాయికి తీసుకురావాలి. స్వచ్చమైన, భగవంతుడిలాంటి మంచితనంతో కూడిన బ్రాహ్మణులను విశ్వమంతా తయారుచేయడమే, ఈ భారత దేశ ఆదర్శo, లక్ష్యమనే సంగతి మరచిపోరాదని మేము బ్రాహ్మణులకి విజ్ఞ్యప్తి చేస్తున్నాము. ఆదికాలంలో ఈ విధంగానే ఉండేదని మహాభారతం చెప్తుంది, ముగింపు కూడా ఇలాగే ఉంటుంది.     

ఉన్నత కులంలో పుట్టటంవల్ల అధికులమనే తప్పుడు భావం చాలామంది బ్రాహ్మణులలో ఉంది; మన దేశo వారైనా, విదేశీయులైనా వీరిని మాటలతో చేతలతో రెచ్చగొట్టి సులువుగా లోబరుచుకోవచ్చు.  బ్రాహ్మణులరా జాగ్రత్త, ఇది మరణానికి సంకేతం! లేవండి, లేచి మీ బ్రాహ్మణత్వాన్ని చూపించండి, మిగతా బ్రాహ్మణేతరులను పై స్థాయికి తీసుకురండి- కుహనా మేదావి లేక అహంకారపూరిత యజమాని లాగా కాదు, నిజమైన సేవా స్ఫూర్తితో.

బ్రాహ్మణులకి నా విజ్ఞ్యప్తి, వారికి వచ్చిన విద్య భారత ప్రజలకి నేర్పిoచి వారిని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి, శతాబ్దాలుగా వారు కూడబెట్టిన సాoస్కృతిక సంపదను అందరికీ పంచాలి. బ్రాహ్మణత్వమంటే ఏమిటో భారతదేశ బ్రాహ్మణులు గుర్తు చేసుకోవడం వారి కర్తవ్యo.  మనువు అన్నట్లు, `ధర్మగుణం అనే సంపద ఉంది’ కాబట్టే  బ్రాహ్మణులకి ఈ అధికారాలు హోదా ఇవ్వబడ్డాయి. వారు ఆ ఖజానా తెరిచి ఆ సంపద అందరికీ పంచిపెట్టాలి.

భారత జాతులకి బ్రాహ్మణుడు ప్రథమ గురువు.  మిగతా వారికి ఆ ఊహకూడా రాకముందే, ఉత్కృష్టమైన మానవ జీవిత పరిపూర్ణతా సాధనకై, అన్నీ త్యాగం చేసిన ప్రథముడు.  మిగతా కులాలను దాటి ముందుకువెళ్ళడం అతని తప్పు కాదు. మిగతా వారు కూడా బ్రాహ్మణులలాగే అన్నీ అర్ధంచేసుకుని ఎందుకు ముందుకు వెళ్ళలేదు? బద్ధకంగా కూర్చుని ఉండిపోయి, బ్రాహ్మణులని పోటీలో ఎందుకు గెలవనిచ్చారు?

అయితే ఒక విషయంలో ప్రయోజనం పొందడం వేరు, దానిని భద్రపరచి చెడు ఉద్దేశాలకి వాడుకోవడం వేరు. అధికారం చెడు ఉద్దేశాలకి వాడితే అది దుష్టశక్తి అవుతుంది, అది మంచికి మాత్రమే వాడాలి.   అనాదిగా కూడబెట్టిన సాoస్కృతిక సంపదకు బ్రాహ్మణుడు ధర్మకర్త, అది ప్రజలకి పంచి ఇవ్వాలి; మొదటినుంచి ఈ ఖజానా తెరిచి ప్రజలకి పంచలేదు కాబట్టే ముస్లిం ఆక్రమణలు జరిగాయి, వేయి సంవత్సరాలపాటు  భారతదేశo మీద ఎవరు పడితే వారు దండయాత్రలు చేస్తే, వారి కాళ్ళక్రింద నలిగిపోయాము; ఆ కారణంగానే మనం ఇంత పతనమైనాము, మన ఉమ్మడి పూర్వీకులు పోగుచేసిన అద్భుతమైన సాoస్కృతిక సంపద ఉన్న ఖజానాను బద్దలుకొట్టడం మొట్టమొదటి పని, వాటిని బయటకు తెచ్చి అందరికీ పంచాలి, బ్రాహ్మణులే ఈ పని మొదట చేయాలి. బెంగాల్లో ఒక పాత నమ్మకo ఉంది, నాగుపాము అది కాటేసిన మనిషినుంచి విషం పీల్చేస్తే, ఆ మనిషి బ్రతుకుతాడు అని. అలాగే,  బ్రాహ్మణుడు తన విషాన్ని తనే పీల్చేయాలి.

బ్రాహ్మణేతర కులాలకు, నేను చెప్తున్నాను, ఆగండి, తొందర పడకండి. ప్రతి విషయంలోనూ ms, Animationబ్రాహ్మణులతో పోట్లాటకి తయారవకండి, ఎందుకంటే నేను వివరించినట్లు, మీ పొరపాట్ల మూలంగానే, మీరు బాధలకు గురి అయారు. సంస్కృత విద్య, ఆధ్యాత్మికత నేర్చుకోవడo ఎందుకు నిర్లక్ష్యం చేసారు? ఇంత కాలంగా ఎం చేస్తున్నారు? ఎందుకు ఉదాసీనంగా ఉండిపోయారు? ఇతరులకు మీకన్నా ఎక్కువ మేధస్సు, శక్తిసామర్ధ్యాలు, ధైర్యం ఉన్నాయని, ఎందుకు మీకు కోపం, అసహనం? పత్రికల్లో అనవసర చర్చలు పోట్లాటలు చేస్తూ, మీ ఇళ్ళల్లో పోట్లాడుకుంటూ మీ శక్తి వృధా చేసుకోకుండా, అదే సామర్థ్యాన్ని, బ్రాహ్మణులకున్న సంస్కృతిక వికాసాన్ని సంపాదించుకోవడానికి వినియోగించండి, అపుడు పని జరుగుతుంది. మీరెందుకు సంస్కృత పండితులు కావట్లేదు? సంస్కృత విద్యను దేశంలో అన్ని కులాలకు అందుబాటులోకి తేవడానికి ఎందుకు లక్షలు ఖర్చు పెట్టట్లేదు? అది అసలు ప్రశ్న. మీరు ఇవన్నీ చేసిన క్షణంనుంచీ మీరు బ్రాహ్మణులతో సమానమే! భారత దేశ రహస్య శక్తి ఇదే.

నిమ్న కులాలకు చెందిన పురుషుల్లారా, నేను చెప్తున్నాను, మీ స్థితి స్థాయి పెంచుకోవడానికి సంస్కృత విద్య ఒకటే మార్గం. అగ్ర కులాలతో పోట్లాటలు, వారికి వ్యతిరేకంగా కోపంగా వ్రాతలు ఇవన్నీ వ్యర్ధమైన పనులు, ప్రయోజనం లేదు, దీనివలన వైరం, వివాదo మరింత పెరుగుతాయి; దురదృష్టవశాత్తు, ఇప్పటికే విభజించబడిన ఈ జాతి మరింతగా విడిపోతుంది.  అగ్రకులాలకి ఉన్న విద్య, సంస్కృతులను స్వంతం చేసుకోవడం ద్వారా  మాత్రమే కులాల మధ్య సమానత సాధ్యమౌతుంది.

`భారతదేశం – సమస్యలపై స్వామి వివేకానంద’ పుస్తకం నుంచి పై వ్యాసం తీసుకోబడింది. 

The above is  Telugu translation of excerpt from the book – Swami Vivekananda on India and Her Problems

అనువాదం – ప్రదక్షిణ 

English Original

 

 

Advertisements

హిందుత్వంలోకి పునరాగమనం గురించి స్వామి వివేకానంద

హిందుత్వంలోకి పునరాగమనం గురించి – స్వామి వివేకానంద ;

(ప్రబుద్ధ భారతి ..ఏప్రిల్ 1899  లో ప్రచురించబడింది.)

ఎడిటర్ గారి కోరిక మేరకు “మతమార్పిడులు– హిందుత్వం ” అనే అంశం పై స్వామి వివేకానంద గారితో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది.  గంగాతీరంలోని శ్రీ రామకృష్ణ మఠం దగ్గర ఒక గంగ హౌస్ బోట్ లో చీకటిపడుతున్నవేళ స్వామి నాతో మాట్లాడటానికి వచ్చారు.

ఈ సమావేశానికి సమయం, ప్రదేశం చాలా అద్భుతంగా కుదిరాయి. తలమీద ఆకాశంలో అంతులేని నక్షత్రాలు,చుట్టూరా చల్లని  గంగా ప్రవాహం, పక్కనే సన్నని వెలుగులతో శ్రీ రామకృష్ణ మఠం ఆశ్రమం, ఆ వెనుకే పొడవైన, దట్టమైన వృక్షాలు.

“నేను మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను స్వామీ”   ముందుగా నేనే సంభాషణ మొదలుపెట్టాను.

“హిందుత్వం నుండి దూరమైనవారు తిరిగి మరల దీనిలో ప్రవేశించాలనుకోవడం గురించి మిమ్మల్ని అడగలనుకుంటున్నాను.””మీ అభిప్రాయంలో వారిని తిరిగి తీసుకోవచ్చంటారా?”

“తప్పకుండా!” అన్నారు స్వామి.”తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా!”

ఆయన దీర్ఘంగా  శ్వాస తీసుకొని వెనక్కివాలి ఒక్క క్షణం విరామం తీసుకున్నారు.

“అయితే” అంటూ మళ్ళీఇలా  అన్నారు.

“అలా తీసుకోకపోతే మన సంఖ్య ఇంకా తగ్గిపోతుంది.” మహమ్మదీయులు ఈ దేశానికి వచ్చినపుడు, ఒక వృద్ధ మహ్మదీయ చరిత్రకారుడు” ఫరిష్తా ”  అప్పటికి ఆరువందల మిలియన్ల హిందువులు ఉన్నట్లుగా చెప్పాడు” .” ప్రస్తుతం మనం రెండువందల మిలియన్లు మాత్రమే ఉన్నాము. అంతేకాక, హిందుత్వంలో నుండి బయటకు వెడుతున్న ప్రతి వ్యక్తీ, ఒక మనిషిగా లెక్కకంటే ఒక శత్రువుగా మారడం విచారకరం.”

        “అయితే అది అప్పుడు అధికారబలం తో ఉన్నవారు కత్తులు చూపించి బెదిరించడం వల్ల ఇస్లాంలోకి, క్రైస్తవం లోకి వెళ్లిన వారు, వారి వారసులు సంగతి. ఇది నిజానికి వారి పట్ల చాలా అన్యాయమైన  విషయం. అయితే ఇలా సమూహాలుగా  ఎక్కువమందిని మతం మార్చడం ఇప్పటికీ ఎందుకు జరుగుతోందంటారు?”

          “నా అభిప్రాయంలో ఈ వివరణ భారత దేశానికీ అవతల ఉన్న జాతులకే కాదు, ఇంకా ఇతర  తెగల వారికీ వర్తిస్తుంది. ఇది మనపై దండెత్తి వచ్చిన అనేక రకాల జాతులవారి విషయంలో జరిగింది. మహమ్మదీయ దురాక్రమణల ముందు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి.  అయితే స్వచ్ఛందంగా మారినవారిని ఏమి చేయలేము కానీ, కేవలం దురాక్రమణ ద్వారా బలవంతంగా మతం మార్చబడిన కాశ్మీర్, నేపాల్ వంటి ప్రాంతాలలో ప్రజలు,  ఇంకా ఇతర వ్యక్తుల విషయంలో ఏ విధమైన ప్రాయశ్చిత్తాలు లేకుండానే వారిని తిరిగి స్వీకరించాలి.”

               నా తరువాతి ప్రశ్న సిద్ధంగా ఉంది. “అయితే మరి వీరందరినీ ఏ కులానికి చెందినవారిగా భావించాలి స్వామీ.”  “వీరిలో చాలామంది లేదా కొంత మంది ఈ అతి పెద్ద హిందూ సమూహాల ద్వారా ఆదరింపబడకపోవచ్చు.  అలాంటి సందర్భాలలో మరి వీరికి సరైన స్థానం ఏదని మీరు అంటారు?”

                  “తిరిగి వచ్చిన వ్యక్తులు తిరిగి వారి వారి పాత ధర్మాలకే చెందుతారు. మరల వీరిలో ఎవరైనా కొత్తవారు ఉంటే వారు వారికి ఇష్టమైన కులాన్ని అవలంబించవచ్చు. ” “నీకు గుర్తుందా! ఇది భారతీయ సనాతన వైష్ణవ సంప్రదాయంలో ఎప్పటినుండో ఉన్నది. వివిధ జాతులు,వర్గాల నుండి హిందుత్వంలోకి మారిన వారందరినీ  ఏకత్రితమ్ చేసి ఒకే ధ్వజం క్రిందకు తీసుకు రావడం జరిగింది. ఇది చాలా గౌరవప్రదమైన విధానం కూడా .” సనాతన రామానుజాచార్యులవారి నుండి బెంగాల్ కి చెందిన ఆధునిక యోగి చైతన్యప్రభువు వరకు ఉన్న వైష్ణవ గురువులందరూ ఈ సంప్రదాయాన్నేఅనుసరించారు.  “

” మరి ఇలా వచ్చిన వారి వివాహాలు ఎక్కడ, ఎలా జరగాలంటారు?”

“వారిలో వారు చేసుకుంటారు.ఇప్పుడలాగే జరుగుతున్నది కదా!”ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు స్వామి.

“మరి ఐతే వారి  పేర్లు ఎలా ఉండాలి?” “ఇతర జాతులు, మతాల నుండి మారిన ఈ హిందువులు కాని వార్ల పేర్లను మార్చి కొత్త పేర్లు ఇవ్వాలి కదా! మరి వారికి కులాల వారీగా పేర్లను ఇస్తారా లేదా మరేమైనా చేస్తారా!”

“తప్పకుండా”, అన్నారు స్వామి. “పేరులో చాలా విశేషతలు ఉన్నాయి. కనుక మార్చక తప్పదు” అన్నారు సాలోచనగా.

ఇక ఈ విషయంపై ఆయన సంభాషణ పొడిగించలేదు.

నా తరువాత ప్రశ్న మళ్ళీ వచ్చింది.”ఇలా వచ్చిన కొత్త వాళ్ళని మీరు హిందుత్వంలోని అనేక రకాలైన ఆరాధనా విధానాల్లో ఏ విధానాన్నైనా అనుసరించవచ్చని వదిలేస్తారా లేదా మీరే వారికి ప్రత్యేకమైన విధానం ఏదైనా సూచిస్తారా?”

“అసలు ఈ ప్రశ్న ఎలా అడిగావు నువ్వు ?”అన్నారు స్వామి.”వారు స్వయంగా వారి విధానాలను నిర్ణయించుకుంటారు.అలా కానప్పుడు అసలు హిందుత్వ భావనే దెబ్బతింటుంది.అసలు మన ప్రాచీన హిందూ ధర్మం యొక్క సారాంశమే అది.దీని ప్రకారం ప్రతి వ్యక్తీ తనకు ఇష్టమైన విధానంలోనే ధర్మాచరణ చేస్తారు.”

నాకు ఈ చర్చ చాలా ప్రభావవంతమైనదని అన్పించింది.నా ముందు కూర్చున్న ఈ వ్యక్తి అనేక సంవత్సరాలుగా ఈ దేశంలోని ప్రజల మధ్య గడుపుతూ హిందుత్వంలోని మూలమైన ధర్మాలను అర్థం  చేస్కుని ఆచరిస్తున్నారు. ఇందులోని సాధారణ నియమాలను, విధానాలను శాస్త్రీయంగా,సానుకూల దృక్పధంతో విశ్లేషించి ప్రజలకు  వివరిస్తున్నారు.

స్వామి చెప్పిన ‘ఇష్టమైన విధానాలను అనుసరించే స్వేఛ్చ” అనే భావన ప్రపంచమంతటినీ తనలో ఇముడ్చుకోగల విశిష్టమైన సంస్కారం. అదే ఈ సనాతన ధర్మం  యొక్క గొప్పదనం.

తరువాత మా సంభాషణ ఇంకా చాలా విషయాలపై సాగింది.చివరగా ఈ అద్భుతమైన స్వధర్మ ప్రభోధకుడు నాకు శుభరాత్రి చెప్పి తన చేతిలోని లాంతరుతో ప్రశాంతంగా మళ్ళీ ఆశ్రమం లోకి వెళ్లిపోయారు. నేను గంగా నదిలో ప్రయాణిస్తూ అందమైన అలలతో ఆమె గీస్తున్న చిత్రాలను ఆస్వాదిస్తూ తిరిగి కలకత్తాకు చేరుకున్నాను.

English Original

Denying National Roots – Early Communism and India

This study by Dr. Rahul Shastri examines the early evolution of the attitude of communism towards nationalism in general and towards Indian nationalism in particular. It also looks at how the ideas of communism were received early but were refracted through the typical Indian genius, into the overarching compass of spirituality.

It then moves on to examine the confrontation of world communism with Indian nationalism, the attempts of comintern to yoke Indian nationalists to their war chariot, and how Indian nationalism escaped its bear-hug.

The study also examines the parallel but interacting emergence of a CPI of comintern in Tashkent and Moscow and of unaffiliated communist organisations and functionaries in India during 1920-30. This decade also saw a shortlived bid of an Indian communism to seek a national political life – a bid that was crushed by hostile takeovers, disciplinary actions and establishment of the ideological and organisational stranglehold of comintern over Indian functionaries.

This period ended in 1930 with the formal affiliation of the CPI of India to the comintern. Ever since and increasingly, this party became merely a wing of world communism – presenting a national visage primarily to enhance recruitment, extend its organisational and ideological footprint, and to advance and enhance the objectives of global communism.

Since any prospect of communism of a specifically Indian variety – of an ‘Indian communism’ as it were, ended with the affiliation of the CPI to the comintern and its conversion into a contingent of world communism in 1930, this study of the early period of Communism in India, ends with that year.

The book is priced at Rs.250/- and can be purchased via amazon.in or mail to samvitkendra@gmail.com for copies.

Mohanji Bhagwat of RSS calls for ordnance for Ram Mandir at Ayodhya

” The Supreme Court has said that dealing with the Ram Mandir issue at Ayodhya is not their priority, (inspite of crores of Hindus having stake in it) . Therefore, we have no other option but to build a people’s movement by which people will put pressure on the government to pass a law. It is for the government to see what needs to be done to build the temple.

Those who want the Ram Mandir at Ayodhya must ensure that this the last leg of this long movement for the temple. We will need to go in batches to construct the temple and hence we must not rest till that dream is fulfilled. ” translated from RSS Sarsanghchalak’s speech at VHP Hunkar Rally in Nagpur on 25th November 2018.

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణ ను అడ్డుకున్న అహోం వీరుడు

భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్  ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు.లచిత్ బోర్ ఫూకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్ యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్ ని తిరిగి సాధించిన  ఘనత లచిత్  దే.

పదిహేడో శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య వైభవం పరాకాష్టలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన మొఘల్ సామ్రాజ్యంకింద అంతే శక్తిమంతమైన సైన్యం ఉండేది. దౌర్జన్యంతో కానీ, రాజీతో కానీ భారత్ లో అత్యధిక శాతాన్ని ఆక్రమించుకున్న మొఘల్ రాజులు మతపరమైనహింసకు, అత్యాచారాలకు పాల్పడడంతో వరుసగా తిరుగుబాటులు, విప్లవాలు వెల్లువెత్తి చివరకి మొత్తం సామ్రాజ్యం చరిత్ర చెత్తబుట్టలోకి కుప్పకూలింది.

మోమాయ్ తమూలి రాజా ప్రతాప సింహ హయాంలో అహోం దళాలకు మొదటి బోర్ బారువా సైనికాధిపతిగా ఉండేవారు. తన కుమారుడు లచిత్రాచరికానికి అవసరమైన అన్ని విద్యల్లో సరైన అభ్యాసం పొందేలా తమూలీ శ్రద్ధ పెట్టారు. విద్యాభ్యాసం ముగించుకున్న లచిత్ ను అహోం స్వర్గదేవ్ కి ప్రైవేటుకార్యదర్శి హోదాలో రుమాలు మోసేవాడిగా నియమించారు.

దేక్సోట్ కోయి ముమై దంగోర్ నోహోయ్” – మా మామయ్య మా దేశం కంటే గొప్ప కాదు.

Lachit leading his troops

అచంచలమైన కర్తవ్య పాలన, విశ్వాసం, శ్రద్ధ లచిత్ తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు.  యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం కావడం ప్రారంభించాడు. ఎంతోకఠినమైన నాయకుడైన లచిత్ తన కర్తవ్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు అంటే, యుద్ధంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో తన విధుల్లో నిర్లక్ష్యం చూపినకారణంగా తన సొంత మామనే తల నరకడానికి వెనుదీయలేదు.

అహోం భూభాగ విముక్తి 

1667 ఆగస్ట్ లో లచిత్, అటన్ బుర్హాగోహిన్ వెంట రాగా, అహోం యుద్ధవీరులను గౌహతి వైపు నడిపించాడు. 1667 నవంబర్ లో ఇటాఖులి కోటను స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఫౌజ్ దార్ ఫిరుజ్ ఖాన్ ను బందీగా పట్టుకుని మొఘల్ దళాలను మానస్ అవతలకి తరిమికొట్టాడు.
1667 డిసెంబర్ లో అహోం వీరుల చేతుల్లో మొఘల్ దళాలు ఓడిపోయిన విషయం నిరంకుశ రాజు ఔరంగజేబుకి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఔరంగజేబు రాజా రామ్ సింగ్ నేతృత్వంలో ఒక భారీ సైన్యం అహోం ల పైన దాడి చేసి, వారిని ఓడించాలని ఆదేశించాడు. అదనంగా తన సైన్యానికి 30,000 మంది పదాతి దళాలు, 21 మంది రాజ్ ఫుట్ అధిపతులు, వారి సైన్యాలు, 18,000 మంది అశ్విక దళం, 2,000 మంది విలువిద్యా నిపుణులు, 40 నౌకలను రామ్ సింగ్ 4,000 మంది చార్ హజారీ మన్సబ్, 1500 మంది ఆహాదీ, 500 మంది బర్ఖ్అందేజే  దళాలకు చేర్చాడు. 

రణ స్థలం ఎంపిక 

మొఘల్స్ ఇటువంటి చర్య తీసుకుంటారని బోర్ ఫ్యూకం ముందే ఊహించాడు. అందువల్ల, గౌహతి మీద అదుపు సాధించిన వెంటనే అతను అహోం భూభాగం చుట్టూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశాడు. బ్రహ్మపుత్ర నదిని ఒక సహజ రక్షణ కవచంగా వాడుకుని, నది గట్లను పటిష్టం చేశాడు. మైదాన ప్రాంతంలో మొఘల్స్ తో పోరాటం అసంభవమని అతనికి తెలుసు. అందువల్ల తెలివిగా  గౌహతి వెలుపల అహోం యుద్ధవీరులకు అనువుగా ఉండే కొండ, అటవీ ప్రాంతాలను ఎంచుకున్నాడు.

గౌహతి పై దాడి, అలబోయ్ 

యుద్ధం
మొఘల్ దళాలు 1669 మార్చ్ లో గౌహతిపై దాడి చేసి, ఏడాది పాటు ఆ నగరమైన తమ పట్టు కొనసాగించారు. ఆ మొత్తం కాలంలో కూడా అహోం ప్రజలు గట్టి భద్రతా ఏర్పాటు చేసుకోవడంతో మొఘల్ సైన్యం ఏమీ చేయలేకపోయింది. అలవాటు లేని వాతావరణం, పరిచితమైన భూభాగం వల్ల వారు దెబ్బతిన్నారు. అహోం లు ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనువుగా వాడుకుని, మొఘల్ దళాలపై గెరిల్లా దాడులు నిర్వహించేవారు.

అప్పుడు మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోం ల మధ్య అసమ్మతి తీసుకొచ్చి, చీలిక కోసం ప్రయత్నించారు. లచిత్ ని ఉద్దేశించిన ఒక లేఖతో  ఒక బాణాన్ని వారు అహోం శిబిరంలోకి ప్రయోగించారు. లచిత్ గౌహతి ఖాళీ చేయిస్తే లక్ష రూపాయలు ఇస్తామని అందులో ఉంది. ఈ సంఘటన గురించి తెలిసిన అహోం రాజుకి లచిత్ విశ్వాసపాత్రత గురించి సందేహం వచ్చింది. అయితే, అటన్ బుర్హాగోహైన్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు.

ఆ ప్రయత్నం విఫలం కావడంతో మొఘల్స్ మైదానంలో పోరాటానికి అహోం లను మోసపూర్తితంగా రప్పించారు. ఇదొక సవాల్ గా తీసుకోవాలని అహోం రాజు లచిత్ ని ఆదేశించాడు. మీరు నవాబ్ నేతృత్వంలో మొఘల్ సైన్యంలో ఒక చిన్న దళం, అలబోయ్ లో అహోం సైన్యంతో తలపడాలి. అహోం వీరులు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుని తమ అదనపు దళాలను, ఆయుధాలను కందకాల్లో దాచిపెట్టారు. దీనితో అహోం లు మీరు నవాబ్ పైన విజయం సాధించగలిగారు. దీనితో ఆగ్రహించిన మొఘల్ నాయకులు తమ సైన్యం యావత్తునూ రంగంలోకి దించడంతో పది వేళా మంది అహోం సైనికులను ఊచకోత కోశారు.

ఈ పరాజయంతో లచిత్ తన సైనికులను ఇటాఖులీ వరకు ఉపసంహరించాడు. ఇంకా యుద్ధం జరుగుతూ ఉండగా, అహోం రాజు చక్రద్వాజా సింహ మరణించాడు. ఆయన కుమారుడు ఉదయాదిత్య సింహ గద్దెనెక్కాడు.  మొఘల్ పన్నాగాలేవి ఫలించకపోవడంతో రామ్ సింగ్ గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్ళీ కట్టుబడేందుకు అహోం లకు 300,000 లక్షల రూపాయలు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే ఢిల్లీలో నిరంకుశ ప్రభువు ఈ ఒప్పందానికి కట్టుబడడు అన్న తీవ్ర అనుమానంతో అటన్ బుర్హాగోహైన్  ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.

ఇదిలా ఉండగా, మొఘల్ నౌకాదళ అధిపతి మునావర్ ఖాన్ రామ్ సింగ్ ని కలిసి అహోం లతో యుద్ధం చేయాలి కానీ మైత్రి కాదన్న ఔరంగజేబు మందలింపు సందేశాన్ని అందించాడు. దీనితో రామ్ సింగ్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగవలసి వచ్చింది. అంధారు బాలి వద్ద నది గాట్లు తెగినట్లు అతనికి సమాచారం అందింది. ఆ సమయంలో లచిత్ తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి, యుద్ధానికి ఏర్పాట్లు పర్యవేక్షించలేకపోయాడు.

ఓటమి కోరల నుంచి విజయం

అలబోయ్ లో తమ పోరాటంలో మొఘల్స్ చేతిలో ఓటమి కారణంగా అహోం సైన్యం నిరుత్సాహంతో కుంగిపోయింది. శత్రువులకు చెందిన పెద్ద పడవలు తమ వైపు వస్తుంటే చూసి వారు భయకంపితులై, అక్కడ నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది చూసి, లచిత్ వెంటనే తన కోసం ఏడు పడవలను సిద్ధం చేయమని, మంచం మీద నుంచి బలవంతంగా లేచి, పడవ ఎక్కాడు. ఏది ఏమైనా, ఏం జరిగినా తానూ తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి, శక్తి కూడగట్టుకుని నిలబడడం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడడంతో, మళ్ళీ సైన్యం పరిమాణం పెరిగింది.

అహోం లు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా, లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్ళాడు.  మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే, చిన్న అహోం పదవులకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో, పెద్ద నౌకలు చిక్కుకుని పోయాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ ఖాన్, అనేకమంది కమాండర్లు, పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు.

అహోం లు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయినా మానస్ వరకు మొఘల్స్ ని తరిమికొట్టారు. మొఘల్స్ నుంచి ఎదురు దాడుల కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని లచిత్ తన సైనికులను హెచ్చరించాడు. ఈ సంఘటనలన్నీ కూడా 1671 మార్చ్ మాసంలో జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

మొఘల్ దళాలపై యుద్ధం గెలిచి, అహోంల వైభవాన్ని పునరుద్ధరించిన లచిత్ మాత్రం యుద్ధం తాలూకు దుష్ప్రభావాలతో కుంగిపోయారు. అప్పుడు అస్వస్థతకు గురైన లచిత్ 1672 ఏప్రిల్ లో మరణించాడు.

వారసత్వం

Lachit Memorial at Naval Defence Academy

హూలంగాపారాలో మహారాజ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ SK సిన్హా  ఖడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్ కు లచిత్ పతకాన్ని బహుకరిస్తారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన లచిత్ ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24ను లచిత్ దివస్ గా జరుపుకుంటారు.

  • తెలుగు అనువాదం ఉషా తురగా రేవెల్లి

In English