ఇటీవల ఒక టీవి (టీవి 9) కార్యక్రమంలో మాట్లాడుతూ కంచ ఐలయ్య తనను తాను ఆధునిక వోల్టేర్ గా అబివర్ణించుకున్నాడు. సదరు కార్యక్రమ నిర్వాహకుడు (మురళీకృష్ణ)గాని, చానల్ కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకపోయినా ఐలయ్య నిజంగా వోల్టేర్ చెప్పినవన్నీ అంగీకరిస్తాడా ? ముఖ్యంగా ఇస్లాం, క్రైస్తవం గురించి వోల్టేర్ చెప్పిన విషయాలను తాను కూడా ప్రచారం చేస్తాడా? చేయగలడా? ఇంతకీ వోల్టేర్ ఇస్లాం, క్రైస్తవం, హిందూత్వం గురించి ఏం చెప్పాడు ?….
క్రైస్తవం గురించి …
ప్రూషియా రాజు ఫ్రెడ్రిక్ II కు 5 జనవరి, 1767న రాసిన ఉత్తరంలో వోల్టేర్ క్రైస్తవం గురించి తన అభిప్రాయాలు వ్యక్తంచేశాడు. “మనది ప్రపంచంలోనే అత్యంత హాస్యాస్పదమైన, అర్ధంలేని మతం. అంతేకాదు ఇది అత్యంత రక్తసిక్తమైన మతం కూడా. ఓ మహారాజా! ఈ అత్యంత మూఢవిశ్వాసాన్ని సమూలంగా పెకిలించివేయడం ద్వారా మీరు ప్రపంచానికి శాశ్వతమైన మేలు చేసినవారు అవుతారు. ఎందుకు పనికిరాని, జ్ఞానగంధం ఏమాత్రం అంటనివారికి ఆ మేలు ఏమిటో తెలియకపోవచ్చును కానీ ఆలోచనాపరులు, నిజాయితీపరులు దానిని గుర్తిస్తారు..అయితే నా విచారమంతా ఈ పవిత్ర , మానవ మేధస్సుకు తట్టిన అత్యంత శ్రేష్టమైన కార్యంలో మీకు సహాయ పడలేకపోతున్నాను.’’
ఇస్లాం గురించి ….
ఇస్లాం గురించి వోల్టేర్ కు సదభిప్రాయం ఎప్పుడూ లేదు. ఖురాన్ భౌతిక శాస్త్ర సూత్రాలకు పూర్తి విరుద్దమని ఆయన భావించాడు. ప్రూషియా రాజు ఫ్రెడ్రిక్ II కు రాసిన ఉత్తరంలో మహమ్మద్ క్రూరత్వాన్ని గురించి ప్రస్తావిస్తూ `దానిని ఎవరూ, ఏ మాత్రం అంగీకరించలేరని నేను కచ్చితంగా చెపుతాను’ అని రాశాడు. మహమ్మద్ కు ఉన్న అనుచరగణమంతా మూఢవిశ్వాసం, అజ్ఞానం వల్లనే అలా మారారని అభిప్రాయపడ్డాడు. ఆ ఉత్తరంలోనే ఇంకా ఇలా రాశాడు -“ఒక ఒంటెల వ్యాపారి తన గ్రామంలో అద్భుతం చేయడమేమిటి? తాను దేవత గాబ్రియల్ తో నేరుగా మాట్లాడతానని అమాయకులైన తన అనుచరులను నమ్మించడమేమిటి? తాను స్వర్గానికి వెళ్ళివచ్చానని నమ్మించడమేమిటి ? అక్కడ `అర్ధంపర్ధంలేని’ ఒక గ్రంధాన్ని పొందానని చెప్పడమేమిటి? ఆ పుస్తకాన్ని విశ్వసించాలని చెప్పడమేమిటి? ఆ పుస్తకం పట్టుకుని తన దేశంలో అల్లకల్లోలం సృష్టించడమేమిటి ? తండ్రుల కుత్తుకలు కోసి, ఆడపిల్లలను ఎత్తుకుపోవడమేమిటి ? తన మతమా లేక మరణమా అంటూ మెడమీద కత్తి పెట్టడమేమిటి ?.. ఇదంతా టర్క్ గా పుట్టినవాడో, అంధవిశ్వాసంతో సహజమైన బుద్ధి పూర్తిగా మందగించినవాడో ఒప్పుకోవాలితప్ప కనీసమైన జ్ఞానం ఉన్న ఎవరు అంగీకరించలేరు. ‘’
హిందూత్వం గురించి…
హిందువుల పవిత్ర గ్రంధాలైన వేదాల గురించి వోల్టేర్ ఇలా వ్యాఖ్యానించాడు -“వేదం వంటి అత్యంత అపురూపమైన బహుమతి ఇచ్చినందుకు పాశ్చాత్య ప్రపంచం ప్రాచ్య ప్రపంచానికి ఎప్పుడూ ఋణపడి ఉంటుంది. ‘’
వోల్టేర్ ఇస్లాం, క్రైస్తవాన్ని గురించి ఇలా మాట్లాడితే , ఆధునిక వోల్టేర్ నని చెప్పుకుంటున్న కంచ ఐలయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వేదాలను తిట్టిపోసి, ఇస్లాం, క్రైస్తవాలను నెత్తిన పెట్టుకోవడం విచిత్రం. దీనినిబట్టి కంచ ఐలయ్య అబద్దాలకోరని, వోల్టేర్ వంటివారి పేరు చెప్పుకుని మేధావిగా చెలామణి అవాలనుకుంటున్న అజ్ఞాని అని తెలుస్తోంది.