అర్నాల్డ్ టాయన్బీ ఇలా అన్నారు – ”పాకిస్థాన్ ఏమిటి? ఈ దేశాన్ని (భారత్) పూర్తిగా ఆక్రమించు కోవాలన్న ముస్లిముల 1200 ఏళ్ల కలకు 20వ శతాబ్దంలో పడ్డ మొదటి అడుగు”
తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటు న్నప్పటికి పాకిస్థాన్ మాత్రం భారత్‌పై, హిందువు లపై నిరంతర దాడికి పాల్పడుతూనే ఉంది. పుల్వామా దాడికి కారకుడైన ఉగ్రవాది విడుదల చేసిన వీడియో వాట్సప్‌లో బాగా ప్రచారం అయింది. అందులో అతని బదులు ఎవరో మాట్లాడినట్లు స్పష్టంగా తెలిసిపోతున్నా, అతను మాట్లాడిన మాటలు మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ముష్రిక్ ల (బహుదేవతారాధకులు) నివాసమైన హిందూస్థాన్‌పై, గోమూత్రాన్ని సేవించేవారిపై(హిందువులు) అతను యుద్ధాన్ని ప్రకటించాడు. ఇస్లాంను కఠినంగా పాటించని, హిందువులతో స్నేహం చేసిన ముస్లిములను ఆ వీడియోలో అతను మందలించాడు కూడా.
కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు, ఎందుకు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారన్న చర్చ బాగా సాగింది. టీవీల్లో సాగిన అలాంటి ఒక చర్చలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారని చెపుతున్న ఒక వ్యక్తి స్థానిక యువత ఇలా ఉగ్రవాదులుగా మారడానికి కారణం రాజకీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనేకాదు ఎవరూ అసలు వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్న సిద్ధాంతం, దాని ప్రచారం గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. జిహాదీ ఉగ్రవాదం వల్ల ప్రపంచంలోని అన్నీ దేశాలు నష్టపోతున్నాయి. అయిన దీనికి కారణమవుతున్న ఖురాన్‌లోని ఆయాత్‌లు, వాటి ద్వారా జరుగుతున్నా ప్రచారాన్ని మాత్రం ప్రశ్నించడానికి ఎవరు ధైర్యం చేయరు. పైగా మనుషుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లని ఉంటారని, ఉగ్రవాదానికి మతం ఉండదని సుద్దులు చెపుతుంటారు. ఉగ్రవాదం వల్ల భారత్ నష్ట పోతున్నప్పుడు పట్టించుకొని అమెరికా సెప్టెంబర్ 2011 దాడులతో ఉలిక్కిపడిండింది. ఇప్పుడు యూరోప్ కూడా మేలుకొంటోంది.
పుల్వామా దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని, భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని ప్రధాని ప్రకటించారు. అందుకు తగినట్లుగానే భారత యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖా (కూూజ) దాటి పాకిస్థాన్‌లోని బాలకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి కూడా. అయితే ప్రభుత్వాలు, సైన్యం చేయాల్సినవి అవి చేస్తాయి. కానీ ప్రజానీకం ఏమి చేయాలి? ఉగ్రభూతం వల్ల నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ధోరణి కలిగిఉండాలి? ప్రభుత్వానికి, సైన్యానికి ఎలా సహకరించాలి?
– నిత్య జాగరూకత వల్లనే స్వాతంత్య్రం నిలబడుతుంది. అవగాహన, విషయపరిజ్ఞానం వల్ల జాగరూకత కలుగుతుంది. శాంతి మతానికి చెందిన పాఠశాలల్లో ఏం చెపుతున్నారు, అది మొత్తం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాదనే అవగాహన ఉండాలి.
– అలాగే ‘శాంతి సందేశాలు’, ‘స్నేహపూర్వక సంబంధాల’ గురించి సుద్దులు చెప్పేవారిని నిలదీయాలి. మత ఛాందసవాదం, పిడివాదం ఎక్కడ ప్రారంభమయింది, ఎక్కడ నుంచి ప్రచారం అవుతోంది, ప్రపం చాన్ని ఎలా నష్ట పరుస్తోంది అనే విషయాలు చర్చించ కుండా తప్పించు కోవడానికి వీలులేదని స్పష్టం చేయాలి.
– దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి అందరితో చర్చిం చాలి. ఎందుకంటే దేశ భద్రత అందరి బాధ్యత. అందరికీ అవసరం.
– మతం ముసుగులో ప్రచారమవుతున్న ప్రమాదకర సిద్ధాంతాల గురించి కుటుంబ సభ్యులతోపాటు బంధువర్గానికి కూడా తెలియచేసే ప్రయత్నం చేయాలి.
– దీనికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని పుస్తకాలు చదవాలి. తెలుగులో జిహాద్, మూల సూత్రాలు, ఇస్లాం సామ్రాజ్యవాదం మొదలైనవి, ఆంగ్లంలో ఖురానిక్ కన్సెప్ట్ ఆఫ్ వార్, వరల్డ్ ఆఫ్ ఫత్వాస్, కలకత్తా ఖురాన్ పిటిషన్, అండర్ స్టాండింగ్ ఇస్లాం త్రూ హదీస్, జిహాద్ ఆర్ ది డాక్ట్రిన్ ఆఫ్ వార్ మొదలైనవి.
– చాలామంది అంటూ ఉంటారు ‘నా స్నేహితులు అలాంటివారు కారు’ అని. నిజమే. అందరూ అలా ఉండరు. కానీ పెద్ద సంఖ్యలో జన నష్టం చేయాలను కుని ఆత్మాహుతి దాడులు చేసే ఉగ్రవాదులను మీ స్నేహితులు ఏమి ఆపలేరు. అది వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు ముల్లా, మౌల్వీ చెప్పినదానినిబట్టి అలాంటి ఉగ్ర ధోరణిని అలవరచుకుంటారు. కాబట్టి ఆ ‘మతాధికారి’ ఏం చెపుతున్నదనేది ముఖ్యం.
– భద్రతా బలగాలకు చేతనైన పద్దతిలో మద్దతు, సహకారం అందించాలి.
– చుట్టుపక్కల ఉండే వారు, ముఖ్యంగా యువత దేశ భద్రత గురించి ఆలోచించేట్లు చేయాలి. అందుకు రోజులో కొంత సమయం కేటాయించాలి.
– కాలనీల్లో, నివాస ప్రాంతాల్లో రక్షా సమితులు ఏర్పాటు చేసుకోవాలి.
– పుల్వామా ఉగ్ర దాడి(14 ఫిబ్రవరి), దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడి (ఫిబ్రవరి, 26) లను మరచిపోకూడదు. ఫిబ్రవరి 14 ను అర్ధంలేని ‘దినం’గా జరుపుకోకుండా అమర జవానుల శ్రద్ధాంజలి దినంగా జరుపుకోవాలి.
ఇవన్నీ చేసినప్పుడు దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు మరింత త్వరగా, బాగా ఫలవంతమవుతాయి.
– ఆయుష్ నడింపల్లి