టిప్పు యొక్క స్వీయ ప్రకటనలు

-సి. నందగోపాల్ మీనన్

(బొంబాయి మలయాలీ సమాజము యొక్క కార్యదర్శి)

“నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా బలహీనతలను కూడా అప్పుడప్పుడు సహించలేవా?””ఈ వాక్యం టిప్పు సుల్తాన్ అతని మంత్రి గణం లో ఒకరైన మీర్ సాదిక్ తో అన్నరుట. The Sword of Tipu Sultan అనే వివాదాస్పద నవలలో రచయిత భగవాన్ S. గిద్వాని కల్పించిన వాక్యమిది.

sword of tipu sultan Tipu_sword

దురద్రుశ్టవసాత్తు టిప్పుసుల్తాన్ జీవిత విశేషాలు బ్రిటీష్ వారు పొందు పరిచినవే అవడం వలన, మరియు ‘విభజించి పాలించు’ అన్న సూత్రముతో పాలించినవారు కాబట్టి, వాటిని నమ్మి అధారపడడం కుదరదు అని అన్ని స్తరాల నవ చరిత్రకారులు, నవలా రచయితలు భావిస్తునారు. కాని అదే సమయం లో 1791-92 మరియు 1798 మధ్య కాలంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శృంగేరి మఠ శంకరాచార్య మరియు టిప్పుసుల్తాన్ మధ్య నడిచిన ఉత్తర-ప్రత్యుత్తరాల ఆధారంగా టిప్పు సుల్తాన్ లౌకికవాదానికి తార్కాణం అని మరియు హిందూ మత పెద్దలను, పీఠాధిపతులను, దేవాలయాలను గౌరవించేవాడని, ఆదరించేవాడు అనే వాదన సలిపేవారు. టిప్పుసుల్తాన్ మతాలకి అతీతంగా అలోచన చేసి దేశ రక్షణే లక్ష్యంగా భావించి బ్రిటీష్ వారితో పోరాడిన మొదటి జాతీయవాది అని కూడా అంగీకరిస్తారు.

కానీ టిప్పు సుల్తాన్ తన కింద అధికారులకు, ముఖ్యంగా ప్రముఖ సేనాధిపతులకు, కోట అధికారులకు, సామంతులకు, మంత్రాంగ సంబంధిత, వ్యాపార సంబంధిత కర్తలకు వ్రాసిన లేఖలు మరియు తను జారీ చేసిన ఆజ్ఞలను చదివినట్లయితే ఈ వాదనలు పటాపంచలయిపోతాయి.

విలియం కిర్క్ పాట్రిక్ 1811లో ఈ లేఖలను సంకలనం చేసి Selected Letters of Tipoo Sultan అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో ఈ విధంగా వ్రాసాడు: “టిప్పు తన అభిమతమే న్యాయము, చట్టము అనియు, దానికి ఎదురుప్రశ్న వేసే ధైర్యము ఏ బానిసలోనూ లేదని గట్టిగా నమ్మేవాడు. మనము తనని గురించి ఊహించే రీతికి భిన్నంగా భిన్న ప్రమాణాలతో తను ప్రజల మనోభావాలను గణనచేసేవాడని చెప్పవచ్చు. ఎందుకంటే తను చేసిన, కావించిన అకృత్యాలను, హత్యలను, నమ్మకద్రోహాలను మనకు నేరాలుగా తోచినా తనకు మాత్రము అవి గొప్పవిగా అనిపించేవి.

 గొప్ప విజయం

కిర్క్ పాట్రిక్ ఇంకా ఇలా వ్రాసారు: “కాఫీర్ లతో గానీ తన సత్యమైన మతము యొక్క శత్రువులతో విశ్వాస-ఘాతకము చేసినా తప్పులేదని తను కురాన్ నుండి నేర్చుకున్నాడు. అందువలననే తనని ఎదురించిన, సహకరించకపోయిన వారిని అందరినీ కలుపుకుంటూ నడవవచ్చు అన్న విషయము అంత కష్టము కాదని తెలిసినా తన మతం, మరియు తన ఆర్భాటం కోసమని అలా ప్రవర్తించేవాడు.”

టిప్పు స్వయంగా బుద్రూజ్ జుమాన్ ఖాన్ కి 1790 జనవరి 19న పంపిన లేఖ చదివినట్లయితే పై విషయం సబబేనని స్పష్టమవుతింది. అందులో ఇలా ఉంది: “ఈ మధ్యన మలబారులో నేను సాధించిన ఘన విజయం గురించి మరియు అక్కడ నాలుగు లక్షలకు పైగా హిందువులను ఇస్లాం కు మత -మార్పిడి జరిగిన విషయం గురించి తెలుసు కదా? నేను త్వరలో ఆ శపించబడ్డ రామన్ నాయర్ (తిరువంకోరు రాజా రామ వర్మ) పై దాడికి కృతనిశ్చయమ్ తో ఉన్నాను. తనని, తన ప్రజలను ఇస్లాం కు త్వరలో మార్చబోతున్నానన్న అత్యానందంలో ఇక శ్రీరంగపట్నం కి తిరిగి వెళ్ళనక్ఖరలేదని నిశ్చయించుకున్నాను.” (K.M. పాణికర్, భాషా పోషిణి, ఆగస్టు 1923)

ఫిబ్రవరి 13, 1790 న బుద్రూజ్ జుమాన్ ఖాన్ కి టిప్పు ఈ విధంగా వ్రాసాడు: “నీవు యాదాస్తులను జతపరుస్తూ పంపిన రెండు లేఖలూ అందాయి. అక్కడి నూట పుప్పై అయిదు మందికి సున్తీ చేయించి, అందులో పదకొండు మంది చిన్నవయస్కులను ఉసూద్ ఇల్హ్యే బంద్ లో చేర్చి, మిగతా తోమ్భైనలుగురు మందిని అహ్మదీ గణం లో చేర్చి, వీరందరినీ నుగుర్ కిలాద్దర్ కింద ఉంచి సరయిన పనిచేసావు.” (Selected Letters of Tipoo Sultan)

జనవరి 18, 1790న సయ్యద్ అబ్దుల్ దులై కి టిప్పు వ్రాస్తూ ఈ విధంగా పేర్కొన్నాడు: “మహమ్మద్ ప్రవక్త మరియు అల్లాహ్ దయవలన సురుమారుగా కాలికట్ లోని హిందువులందరూ ఇస్లామ్ కి మార్చబడ్డారు. కోచిన్ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమూ ఇంకా కొందరు హిందువులుగా మిగిలిపోయారు. వారందరిని కూడా త్వరలోనే మార్చెయ్యాలని కృతనిశ్చయుడినిగా ఉన్నాను. ఇది జిహాద్ గా భావిస్తూ ఉన్నాను.” (K.M. పాణికర్, భాషా పోషిణి, ఆగస్టు 1923)

అవే బోలెడు చెబుతాయి

1793 లో లండన్లో మేజర్ అలెక్స్ డిరొమ్ ప్రచురించిన మూడవ మైసూర్ యుద్ధము యొక్క పూర్తీ వివరాలలో టిప్పు సుల్తాన్ రాజ ముద్ర పై లిఖిత వచనపు అనువాదము ఇలా వ్రాయబడి ఉంది:

“నేను నిజమయిన మతము (ఇస్లాం) యొక్క దూతను.

“నేను నిజమయిన మతము యొక్క ఆజ్ఞలను మీముందుకు తెచ్చాను.

ఆక్రమణ, దాడులు మరియు రాజ హైదర్ ను రక్షించడం లోనే సుల్తాన్ గా నా వెల్లువ. సూర్యుడు, మరియు చంద్రుడు కింద ఉన్న యావత్ జగత్తు నా సంతకం ఆధారమే.”

ఈ లేఖలు, రాజ ముద్ర తన మనస్సులోని ఉద్దేశ్యాన్ని తెలుపుతాయి, ఎవడయితే దక్షిణ భారతం మరియు ఆగ్నేయ మహారాష్ట్రను ఒక దశాబ్ద కాలం పాటు అంతటా తిరుగుతూ, ప్రజను భయంకరమైన క్షోభకు గురిచేస్తూ వచ్చాడు. కేవలం ‘హిందువులు ఆంగ్లేయులకు సహకరిస్తున్నారన్న’నెపం తోనే అతను ఈ విధంగా ప్రవర్తించేడు అని చెప్పలేము.

‘ఆంగ్లేయులతో పోరాడాడు కనుక టిప్పు కూడా దేశభక్తుడే’ అనే కొంతమంది లౌకిక-వాద చారిత్రకుల వాదనకు పై ఉదాహరణలవలన బలం సరిపోదు. ఫ్రెంచ్ వారిని భారతదేశం పై దాడికి ఆహ్వానించినందువలన టిప్పు సుల్తాన్ దేశద్రోహి అని ప్రముఖ చారిత్రవేత్త Dr. I.M. ముత్తన్న Tipu Sultan X-Rayed అనే పుస్తకంలో పేర్కొన్నారు. పెర్షియన్ ఫైల్ ఆఫ్ రికార్డ్స్ లో నాలుగవ విషయంగా జతపరచబడిన టిప్పు సుల్తాన్ ఏప్రిల్ 21, 1797 న వ్రాసిన లేఖ ఆ పుస్తకం లో ఇలా ముద్రించబడి ఉంది:

“నాగరిక ప్రతినిధులారా,

“నేను మీకు నా స్నేహాన్ని లేఖ రూపంలో ప్రకటీకరించినప్పటినుండి, మీకు నిరాశ కలిగించని విధంగా మా వార్తాహరులు ఈ కింది సమాచారాన్ని సేకరించారు:

“ఆంగ్లేయుల సహకారి అయిన ముఘలాయుల ముఖ్యుడు అయిన నిజామ్ తన వృధ్ధాప్యం వలన అనారోగ్యంతో బాధ పడుతూ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అతని నలుగు కుమారులు తమ తమ వారసత్వానికి వివాదం లో కొట్టుకుంటున్నారు. వారిలో ఒకడు, పురప్రముఖులచే మెచ్చినవాడు, త్వరలో వారసుడు కాబొత్తున్నవాడు నాకు సన్నిహితుడు.

“నేను ఈ విషయాలను ఒక క్రమంలో ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మీరు ఇండియా పై దాడి చేయటానికి సరయిన సమయము. చాలా తక్కువ కష్టం తో మనము బ్రిటిష్ వారిని ఇండియా నుండి పారద్రోయగలము. నా మైత్రి పై విశ్వాసముంచండి.

“మీ సహకారి, భవదీయుడు టిప్పు సుల్తాన్”

ఇది టిప్పు కి భారతదేశం పై నున్న ప్రేమ కు తార్కాణమ్.

ప్రపంచ ప్రఖ్యాత యాత్రికుడు, బార్తోలోమియో (తను బ్రిటిష్ వ్యక్తీ కాడు) Voyage to East Indies అనే పుస్తకం లో ఇలా వ్రాసాడు: “తొలుతగా ఒక ముప్పదివేల మంది కిరాతకులు ఎదురుపడినవారందరినీ అడ్డంగా నరుకుతూ పోయేవారు… వాళ్ళననుసరించి M. lally అనే కమాండర్ కింద తుపాకులతో సైనికులు… టిప్పు ఏనుగు మీద సవారీ చేస్తూ, తన వెనుక మరో ముప్పదివేల మంది సైన్యం తో. కాలికట్ లో చాలా మట్టుకు మగ, ఆడవారిని ఉరితీసేవారు – ముందు పిల్లలను తల్లుల మెడకు కట్టేసి తల్లులను ఉరితీసేవారు. అట్టి కిరాతక టిప్పు సుల్తాన్ క్రైస్తవులను మరియు హిందువులను నగ్నంగా ఏనుగు కాళ్ళకు కట్టివేసి ఊళ్ళో తిప్పించేవాడు వీళ్ళ శరీరాలు చినిగి, తునాతునకలయ్యేన్తవరకు. హిందూ దేవాలయాలను, చర్చులను పడగొట్టించి, కాల్చి, కూల్చి వేయించేవాడు. హిందూ మరియు క్రైస్తవ వనితలను బలవంతంగా ముస్లింలచే పెళ్లి చేయించేవాడు. అట్లానే హిందూ, క్రైస్తవ పురుషులను ముస్లిం వనితలకిచ్చి బలవంతంగా వివాహం జరిపించేవాడు. దీనికి వ్యతిరేకించిన వారిని వెంటనే ఉరితీసి చంపవలేనాను మరణదండనను విధించేవాడు. ఈ దారుణాలను టిప్పు సుల్తాన్ సైనం నుండి తప్పించుకొని వరప్పుష చేరిన బాధితులు నాకు చెబితే తెలిసినవి. వరపపుష కార్మైకేల్ మిషన్ యొక్క కేంద్రం. నేను స్వయంగా ఎందఱో ఇట్టి బాధితులను వరపపుష నదిని పడవలో తప్పించుకోడానికి సహాయము చేసాను.”

గో హత్యా

“పడయోట్టం సైనిక ఆక్రమణ కాలంను మలయాళీలు కొన్ని తరాల కాలం పాటు మరచిపోలేవు. మలయాళ శకము 957 నుండి 967 వరకు (1782 నుండి 1792) జరిగిన ఈ దాడులే మలయాళం ను తలకిందులుగా చేసింది” అని P. రామన్ మేనన్ అంటారు. ఇతను శక్తన్ తంపురన్ అనే కొచిన్ రాజు యొక్క జీవిత చరిత్రను టిప్పు సుల్తాన్ యొక్క ఈ దాడుల సమయం లోనే వ్రాసారు. “ఈ మైసూరు పులి చొరబడని గోశాల అంటూ బహుశా లేదేమో మలయాల దేశం లో” అని వ్రాస్తారు రామన్ మేనన్ గారు. తన ఆజ్ఞ మేరకు టిప్పు సైన్యాలు జరిపిన సామూహిక గో హత్యల మారణ హోమం నేపథ్యమ్ లో పై విషయాలు తెలుస్తాయి.

1783-84, 1788, 1789-90 సమ్వత్సరాల మధ్యలో కేరళలో ఎక్కడెక్కడ ప్రతిఘటనలు ఎక్కువెక్కువ అవుతూ ఉండేవో అక్కడకి తన సైన్యాన్ని పంపించడమే కాకుండా తను స్వయంగా దాడులకు నాయకత్వం వహించేవాడు. ఈ దాడుల గురించి ప్రముఖ ముస్లిం చరిత్రకారులు, కేరళ ముస్లిం చరిత్రం అనే పుస్తక రచయిత P.S. సయ్యద్ మహమ్మద్ ఈ విధంగా అంటారు: “కేరళ లో టిప్పు సుల్తాన్ జరిపిన దాడులు భారత దేశం పై చెంగీజ్ ఖాన్ మరియు తిమూర్ జరిపిన దాడులను జ్ఞప్తికి తెస్తాయి.”

వడకుంకూర్ రాజు, రాజా వర్మ కేరళ సంస్కృత సాహిత్య చరితం లో ఈ విధంగా వ్రాసారు: “టిప్పు సుల్తాన్ దాడుల సమయంలో లెక్ఖలేనన్ని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దేవాలయాలకు నిప్పు పెట్టడం, విగ్రహాలను ధ్వంసం చెయ్యడం, గోహత్యలను చెయ్యడం – ఈ మూడు టిప్పు సుల్తాన్ మరియు తన సైన్యానికి ఒక అలవాటులా ఉండేది. తలిప్పరంపు మరియు త్రిచంబరం మందిరాల విధ్వంస కాండ యొక్క తలంపే చాలా హృదయవిదారకంగా ఉంటుంది.”

Malabar Gazetteer ప్రకారము తలి, శ్రీవలియనాతుకవు, తిరువన్నూర్, వరక్కల్, పుతూర్, గోవిందాపురం మరియు తలికున్ను మొదలగు ఓఓళ్ళల్లోని ముఖ్యమైన దేవాలయాల విధ్వంసం కేవలం టిప్పు సైన్యం యొక్క దారుణ కాండలవల్లనే. ఋగ్వేద పాఠనంలో యావత్ భారతదేశంలో కేంద్రబిందువుగా ఉండెడి తిరునవాయ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసారు. జమోరిన్ రాజుల రాజధానిగా ఉండేది కాలికట్ నగర విధ్వంసంని టిప్పు స్వయం ఆజ్ఞాపించాడు.

వడకుంనాథ మందిరంలో దొరికే K.V. కృష్ణ అయ్యర్ రచించిన zamorins of calicut మరియు విలియం లోగాన్ వ్రాసిన Malabar Manual పుస్తకాలలో టిప్పు సుల్తాన్ దాడులలో నాశనం చేసిన వందల కొలది దేవాలయాల పేర్లు ఆవలిగా లిఖించబడి ఉన్నాయి.

జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం

టిప్పుకి జ్యోతిష్యం పై మిక్కిలి నమ్మకం కలదు అన్న విషయం చాలా సాధారణంగా తెలిసినదే. తన దర్బారులో చాలా పెద్ద సంఖ్యలో జ్యోతిష్యులను ఉంచేవాడు. వాళ్ళని తను చెయ్యదలుచుకున్న దాడులకు మంచి ముహూర్తాలను నిర్ణయించుకునే వాడు. ఏ జ్యోతిష్యులు, మరియు తన సొంత తల్లి ప్రాధేయాల మేరకు శ్రీరంగపట్నం కోటలోని డజనుకు పైగా ఉన్న మందిరాలలో రెండు మాత్రం వదిలిపెట్టాడట. అదేసమయంలో 1790 చివరిలో టిప్పుకి అన్ని వైపులనుండి శతృవులు మొదలయ్యారు. తను తిరువంకోర్ డిఫెన్స్ లైన్స్ వద్ద ఓడిపోయాడు. ఆ తరువాత తను మైసూర్లో హిందువులను ప్రీతి పరచడానికి హిందూ దేవాలయాకని భూములను దానం ఇవ్వడం మొదలుపెట్టాడు.

తిరువాంకోర్ దివాన్ యొక్క జీవిత చరిత్రను V.R. పరమేశ్వరన్ పిళ్ళై Life History of Raja Keshavadas అనే పుస్తకంలో పై సత్యాలతో ఏకీభావం దొరుకుతుంది. అందులో ఈ విధంగా వ్రాసారు: “బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయాలకాని భూముల దానాల విషయం లో కారణాలను నేను 40 ఏళ్ళ క్రితమే చెప్పాను. టిప్పుకు జ్యోతిష్యం దాని ఫలితాలపై చాలా నమ్మకం కలవాడు. తను భవిష్యత్తులో బ్రిటిష్ వారిని ఓడించి తను పాదుషా కావాలన్న కోరిక కోసమే భూ-దానాలు, మైసూర్ లోని దేవాలయాలకు దానాలు మరియు, శృంగేరి లోని కొంతమంది బ్రాహ్మణ జ్యోతిష్యుల సలహా మేరకు శృంగేరి మఠానికి కూడా దానాలు చేసాడు. ఇవన్నీ కూడా తను 1791 ఓటమి మరియు 1792 లో జరిగిన అవమానాస్పద సంధి ఒప్పందం తరువాత నుండి మొదలుపెట్టాడు. ఈ దానాలు తనకు హిందువులపై ప్రేమ కొద్దో లేక హిందూ దేవాలయాలపై గౌరవం కొద్దో చెయ్యలేదు. కేవలం పాదుషా అవ్వడానికని తన జ్యోతిష్యులు చెప్పిన సలహామేరకే చేసాడు.”

టిప్పు పై సంజయ్ ఖాన్ తీసిన వివాదాస్పదమైన టీవీ సీరియల్లో మొదట్లో తను గిద్వాని నవల ఆధారంగా మాత్రమే తీసాను గానీ ఇతర వక్రీకరణలేమీ లేవు అని అన్నప్పటికీ ఇప్పుడు The Week పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘గిద్వానీ నవల చరిత్రాత్మకంగా యథా-తథం అని చెప్పలేము’ అని ఒప్పుకున్నాడు. – Indian Express (Bombay), March 10, 1990

English Original –

http://voiceofdharma.com/books/tipu/ch03.htm

Translated by – Smt. Usha Lavanya

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s