లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణ ను అడ్డుకున్న అహోం వీరుడు

భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్  ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు.లచిత్ బోర్ ఫూకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్ యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్ ని తిరిగి సాధించిన  ఘనత లచిత్  దే.

పదిహేడో శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య వైభవం పరాకాష్టలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన మొఘల్ సామ్రాజ్యంకింద అంతే శక్తిమంతమైన సైన్యం ఉండేది. దౌర్జన్యంతో కానీ, రాజీతో కానీ భారత్ లో అత్యధిక శాతాన్ని ఆక్రమించుకున్న మొఘల్ రాజులు మతపరమైనహింసకు, అత్యాచారాలకు పాల్పడడంతో వరుసగా తిరుగుబాటులు, విప్లవాలు వెల్లువెత్తి చివరకి మొత్తం సామ్రాజ్యం చరిత్ర చెత్తబుట్టలోకి కుప్పకూలింది.

మోమాయ్ తమూలి రాజా ప్రతాప సింహ హయాంలో అహోం దళాలకు మొదటి బోర్ బారువా సైనికాధిపతిగా ఉండేవారు. తన కుమారుడు లచిత్రాచరికానికి అవసరమైన అన్ని విద్యల్లో సరైన అభ్యాసం పొందేలా తమూలీ శ్రద్ధ పెట్టారు. విద్యాభ్యాసం ముగించుకున్న లచిత్ ను అహోం స్వర్గదేవ్ కి ప్రైవేటుకార్యదర్శి హోదాలో రుమాలు మోసేవాడిగా నియమించారు.

దేక్సోట్ కోయి ముమై దంగోర్ నోహోయ్” – మా మామయ్య మా దేశం కంటే గొప్ప కాదు.

Lachit leading his troops

అచంచలమైన కర్తవ్య పాలన, విశ్వాసం, శ్రద్ధ లచిత్ తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు.  యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం కావడం ప్రారంభించాడు. ఎంతోకఠినమైన నాయకుడైన లచిత్ తన కర్తవ్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు అంటే, యుద్ధంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో తన విధుల్లో నిర్లక్ష్యం చూపినకారణంగా తన సొంత మామనే తల నరకడానికి వెనుదీయలేదు.

అహోం భూభాగ విముక్తి 

1667 ఆగస్ట్ లో లచిత్, అటన్ బుర్హాగోహిన్ వెంట రాగా, అహోం యుద్ధవీరులను గౌహతి వైపు నడిపించాడు. 1667 నవంబర్ లో ఇటాఖులి కోటను స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఫౌజ్ దార్ ఫిరుజ్ ఖాన్ ను బందీగా పట్టుకుని మొఘల్ దళాలను మానస్ అవతలకి తరిమికొట్టాడు.
1667 డిసెంబర్ లో అహోం వీరుల చేతుల్లో మొఘల్ దళాలు ఓడిపోయిన విషయం నిరంకుశ రాజు ఔరంగజేబుకి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఔరంగజేబు రాజా రామ్ సింగ్ నేతృత్వంలో ఒక భారీ సైన్యం అహోం ల పైన దాడి చేసి, వారిని ఓడించాలని ఆదేశించాడు. అదనంగా తన సైన్యానికి 30,000 మంది పదాతి దళాలు, 21 మంది రాజ్ ఫుట్ అధిపతులు, వారి సైన్యాలు, 18,000 మంది అశ్విక దళం, 2,000 మంది విలువిద్యా నిపుణులు, 40 నౌకలను రామ్ సింగ్ 4,000 మంది చార్ హజారీ మన్సబ్, 1500 మంది ఆహాదీ, 500 మంది బర్ఖ్అందేజే  దళాలకు చేర్చాడు. 

రణ స్థలం ఎంపిక 

మొఘల్స్ ఇటువంటి చర్య తీసుకుంటారని బోర్ ఫ్యూకం ముందే ఊహించాడు. అందువల్ల, గౌహతి మీద అదుపు సాధించిన వెంటనే అతను అహోం భూభాగం చుట్టూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశాడు. బ్రహ్మపుత్ర నదిని ఒక సహజ రక్షణ కవచంగా వాడుకుని, నది గట్లను పటిష్టం చేశాడు. మైదాన ప్రాంతంలో మొఘల్స్ తో పోరాటం అసంభవమని అతనికి తెలుసు. అందువల్ల తెలివిగా  గౌహతి వెలుపల అహోం యుద్ధవీరులకు అనువుగా ఉండే కొండ, అటవీ ప్రాంతాలను ఎంచుకున్నాడు.

గౌహతి పై దాడి, అలబోయ్ 

యుద్ధం
మొఘల్ దళాలు 1669 మార్చ్ లో గౌహతిపై దాడి చేసి, ఏడాది పాటు ఆ నగరమైన తమ పట్టు కొనసాగించారు. ఆ మొత్తం కాలంలో కూడా అహోం ప్రజలు గట్టి భద్రతా ఏర్పాటు చేసుకోవడంతో మొఘల్ సైన్యం ఏమీ చేయలేకపోయింది. అలవాటు లేని వాతావరణం, పరిచితమైన భూభాగం వల్ల వారు దెబ్బతిన్నారు. అహోం లు ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనువుగా వాడుకుని, మొఘల్ దళాలపై గెరిల్లా దాడులు నిర్వహించేవారు.

అప్పుడు మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోం ల మధ్య అసమ్మతి తీసుకొచ్చి, చీలిక కోసం ప్రయత్నించారు. లచిత్ ని ఉద్దేశించిన ఒక లేఖతో  ఒక బాణాన్ని వారు అహోం శిబిరంలోకి ప్రయోగించారు. లచిత్ గౌహతి ఖాళీ చేయిస్తే లక్ష రూపాయలు ఇస్తామని అందులో ఉంది. ఈ సంఘటన గురించి తెలిసిన అహోం రాజుకి లచిత్ విశ్వాసపాత్రత గురించి సందేహం వచ్చింది. అయితే, అటన్ బుర్హాగోహైన్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు.

ఆ ప్రయత్నం విఫలం కావడంతో మొఘల్స్ మైదానంలో పోరాటానికి అహోం లను మోసపూర్తితంగా రప్పించారు. ఇదొక సవాల్ గా తీసుకోవాలని అహోం రాజు లచిత్ ని ఆదేశించాడు. మీరు నవాబ్ నేతృత్వంలో మొఘల్ సైన్యంలో ఒక చిన్న దళం, అలబోయ్ లో అహోం సైన్యంతో తలపడాలి. అహోం వీరులు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుని తమ అదనపు దళాలను, ఆయుధాలను కందకాల్లో దాచిపెట్టారు. దీనితో అహోం లు మీరు నవాబ్ పైన విజయం సాధించగలిగారు. దీనితో ఆగ్రహించిన మొఘల్ నాయకులు తమ సైన్యం యావత్తునూ రంగంలోకి దించడంతో పది వేళా మంది అహోం సైనికులను ఊచకోత కోశారు.

ఈ పరాజయంతో లచిత్ తన సైనికులను ఇటాఖులీ వరకు ఉపసంహరించాడు. ఇంకా యుద్ధం జరుగుతూ ఉండగా, అహోం రాజు చక్రద్వాజా సింహ మరణించాడు. ఆయన కుమారుడు ఉదయాదిత్య సింహ గద్దెనెక్కాడు.  మొఘల్ పన్నాగాలేవి ఫలించకపోవడంతో రామ్ సింగ్ గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్ళీ కట్టుబడేందుకు అహోం లకు 300,000 లక్షల రూపాయలు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే ఢిల్లీలో నిరంకుశ ప్రభువు ఈ ఒప్పందానికి కట్టుబడడు అన్న తీవ్ర అనుమానంతో అటన్ బుర్హాగోహైన్  ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.

ఇదిలా ఉండగా, మొఘల్ నౌకాదళ అధిపతి మునావర్ ఖాన్ రామ్ సింగ్ ని కలిసి అహోం లతో యుద్ధం చేయాలి కానీ మైత్రి కాదన్న ఔరంగజేబు మందలింపు సందేశాన్ని అందించాడు. దీనితో రామ్ సింగ్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగవలసి వచ్చింది. అంధారు బాలి వద్ద నది గాట్లు తెగినట్లు అతనికి సమాచారం అందింది. ఆ సమయంలో లచిత్ తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి, యుద్ధానికి ఏర్పాట్లు పర్యవేక్షించలేకపోయాడు.

ఓటమి కోరల నుంచి విజయం

అలబోయ్ లో తమ పోరాటంలో మొఘల్స్ చేతిలో ఓటమి కారణంగా అహోం సైన్యం నిరుత్సాహంతో కుంగిపోయింది. శత్రువులకు చెందిన పెద్ద పడవలు తమ వైపు వస్తుంటే చూసి వారు భయకంపితులై, అక్కడ నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది చూసి, లచిత్ వెంటనే తన కోసం ఏడు పడవలను సిద్ధం చేయమని, మంచం మీద నుంచి బలవంతంగా లేచి, పడవ ఎక్కాడు. ఏది ఏమైనా, ఏం జరిగినా తానూ తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి, శక్తి కూడగట్టుకుని నిలబడడం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడడంతో, మళ్ళీ సైన్యం పరిమాణం పెరిగింది.

అహోం లు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా, లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్ళాడు.  మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే, చిన్న అహోం పదవులకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో, పెద్ద నౌకలు చిక్కుకుని పోయాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ ఖాన్, అనేకమంది కమాండర్లు, పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు.

అహోం లు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయినా మానస్ వరకు మొఘల్స్ ని తరిమికొట్టారు. మొఘల్స్ నుంచి ఎదురు దాడుల కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని లచిత్ తన సైనికులను హెచ్చరించాడు. ఈ సంఘటనలన్నీ కూడా 1671 మార్చ్ మాసంలో జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

మొఘల్ దళాలపై యుద్ధం గెలిచి, అహోంల వైభవాన్ని పునరుద్ధరించిన లచిత్ మాత్రం యుద్ధం తాలూకు దుష్ప్రభావాలతో కుంగిపోయారు. అప్పుడు అస్వస్థతకు గురైన లచిత్ 1672 ఏప్రిల్ లో మరణించాడు.

వారసత్వం

Lachit Memorial at Naval Defence Academy

హూలంగాపారాలో మహారాజ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ SK సిన్హా  ఖడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్ కు లచిత్ పతకాన్ని బహుకరిస్తారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన లచిత్ ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24ను లచిత్ దివస్ గా జరుపుకుంటారు.

  • తెలుగు అనువాదం ఉషా తురగా రేవెల్లి

In English

1 thought on “లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణ ను అడ్డుకున్న అహోం వీరుడు

  1. Pingback: Lachit – The Warrior | Arise Bharat

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s