ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ -కాంగ్రెస్ జెండా

1937 కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశపు జెండా ఉత్సవంలో, 80అడుగుల కర్రపై కాంగ్రెస్ పతాకం చిక్కుకుపోయింది. ఎంతమంది ప్రయత్నించినా చిక్కు విడలేదు. అంతలో శ్రీ కిషన్ సింగ్ పరదేశి ధైర్యంగా 80అడుగుల కర్రని ఎక్కి, చిక్కుపడిపోయిన జెండాని విడిపించాడు, పతాకo ఎగరవేసినపుడు, అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. ఒకరు శ్రీ పరదేశిని సత్కరించాలని ప్రతిపాదిస్తే సమావేశం ఆమోదించింది. అయితే తాను ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా అలవరచుకున్న జాతీయ స్ఫూర్తితో ధైర్యం చేయగలిగానని ఆయన చెప్పగానే కాంగ్రెస్ నాయకులు వెనుకాడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను వారు ఎలా సత్కరిస్తారు? హిందుత్వ దృక్పధం ఉన్న సంస్థల పట్ల కాంగ్రెస్ వివక్ష ఈ సంఘటనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుoది.

   Kishen Singh 2

  

ఒక స్వయంసేవక్ చేసిన సాహసo విని డా.హెడ్గెవార్ ఎంతో సంతోషించారు. సాధారణంగా సంఘ్ కార్యక్రమాలకు ఎటువంటి ప్రచారం ఉండదు. దీనికి భిన్నంగా డా.హెడ్గెవార్, శ్రీ కిషన్ సింగ్ పరదేశిని దేవపూర్ శాఖకు ఆహ్వానించి ఆయనకు ఒక చిన్నవెండి బహుమతినిచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన `అవసరమైతే ప్రాణత్యాగమైనా చేసి, దేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం ఒక స్వయంసేవకుడి కర్తవ్యo, అది మన జాతీయ ధర్మం’ అన్నారు.    

ఒక వైపు డా.హెడ్గెవార్ సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తితో కాంగ్రెస్ పట్ల అభిమానం చూపెడితే, కాంగ్రెస్ మాత్రం సంఘ్ మీద ద్వేషం పెంచుకుంది. సంఘ్ సానుభుతిపరుడైన ఒక కాంగ్రెస్ వ్యక్తి డా.కాకాసాహెబ్ తెమ్భే, ఈ విషయంపై కలతచెంది, కాంగ్రెస్ పనితీరు, సైద్ధాంతిక వైఖరిని విమర్శిoచాలని కోరుతూ డా.హెడ్గెవార్ కి లేఖ వ్రాసారు. అలా చేస్తే సంఘ్ కార్యకర్తల అసంతృప్తి కొంతవరకు తగ్గుతుందని డా. తెమ్భే అనుకున్నారు.    

 

తెమ్భేకి  డా.హెడ్గెవార్ వ్రాసిన సమాధానం, ఆయనకు కాంగ్రెస్ పై ఉన్న అభిప్రాయమేకాక, ఆయన తాత్విక దృష్టిని కూడా తెలుపుతుంది. స్వయంసేవకుల మనసుల్లో కాంగ్రెస్ పట్ల ఎటువంటి విముఖత కలగకూడదని ఆయన భావించారు. ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి- ఆర్ఎస్ఎస్ వేగంగా తన బలం పెంచుకుని, విప్లవo ద్వారా బ్రిటిషువారిని దేశం నుంచి తరిమిగొట్టడం; రెండు కాంగ్రెస్ ఆధ్వర్యంలో  సామ్రాజ్యవాద వ్యతిరేక పోరు కొనసాగించడం. బ్రిటిషువారితో  పోరాటంలో అనేక కేంద్రాలు ఏర్పడడం డా.హెడ్గెవార్ కు ఇష్టం లేదు. ఈ ఆలోచనతోనే ఆయన  తెమ్భేకి  ఈ విధంగా వ్రాసారు –   

 `ప్రపంచంలో ప్రతి వ్యక్తి వారి మనస్తత్వం ప్రకారం ప్రవర్తిస్తుంటారు, ఒక పార్టీకి లేక ఒక సిద్ధాంతానికి వారిని ప్రతినిధిగా అనుకునే అవసరం లేదు. నా అభిప్రాయంలో, ఏ సభ్యుడు ఏ విధంగా మాట్లాడినా, ఆ వ్యక్తి ఉన్నపార్టీని లేక సిద్ధాంతాన్ని పొగడడం లేక ఖండించడం పొరపాటు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా, మరొక పార్టీకి చెడు జరగాలని కోరుకోరు’. 

  • అనువాదం – ప్రదక్షిణ 

Source : “Builders of Modern India” – Dr.Keshav Baliram Hedgewar by Publications Division;

English Original

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s