Rashtra Sevika Samiti Warns Congress and Outlook Magazine

Rashtra Sevika Samiti Statement

Rashtra Sevika Samiti Statement

రాష్ట్ర సేవికా సమితి, వర్ధా కేంద్రము

కుమారి ప్రియాంక చతుర్వేది మరియు కుమారి శోభా ఓఝా (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు) ల ద్వారా ఈ రోజు అనగా 30.7.16 రోజున  ‘రాష్ట్ర సేవికా సమితి ద్వారా మైనరు బాలికల అపహరణ ’ అన్న శీర్షికన వెలువడిన ప్రకటన అసత్యము మరియు బాధ్యతా రహితమైనది.  ‘ఔట్ లుక్’ వార పత్రిక యొక్క ముఖచిత్ర కధనము కూడా అసత్యము, నిరాధారము మరియు ప్రక్కదారి పట్టించేదిగా వున్నది.

రాష్ట్ర సేవికా సమితి ద్వారా నడుపబడే విద్యార్ధి వసతి గృహాలన్నీ చట్టబద్ధము మరియు చట్టప్రకారము నడుపబడుతున్నవి.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు ఔట్ లుక్ వారపత్రిక సంపాదకులు మరియు ‘ఆపరేషన్ బేటీ బచావో’ శీర్షికన వెలువడిన వ్యాస రచయిత్రి నేహా దీక్షిత్ గారి చర్యలను రాష్ట్ర సేవికా సమితి  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒక వార పత్రిక యొక్క ముఖచిత్ర శీర్షికన వెలువడిన వ్యాసము వారి రాజకీయ భావాలను వెల్లడిస్తుంది.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు మరియు ఔట్ లుక్ వారపత్రికలోని వ్యాసము ద్వారా వ్యక్తీకరించిన భావాలు అసత్యము మరియు నిరాధారము. గత 80 సంవత్సరాలుగా సమితి చేసిన నిస్వార్ధ సేవ, వ్యక్తిత్వ నిర్మాణము,  నిరంతరం దేశభక్తిని ప్రేరణ చేసే రాష్ట్ర సేవికా సమితి మీద ఉద్దేశపూర్వకముగా చేసిన దుష్ప్రచారముగా భావించబడును.

పైన తెలిపిన వ్యక్తులు రాష్ట్ర సేవికా సమితి పై చేసిన ఆరోపణలు మానహానిగా భావించబడినందువలన వారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పవలసినదిగా ఇందుమూలముగా కోరడమైనది. లేని యెడల చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి సిధ్ధముగా వుండవలెను.

అన్నదానం సీత

ప్రముఖ్ కర్యవాహిక  – రాష్ట్ర సేవికా సమితి

All India General Secretary, Rashtra Sevika Samiti

30.7.2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s